Nikhil: కార్తికేయ 2 సినిమా తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సూపర్ సక్సెస్ సాధించి నిఖిల్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. కార్తికేయ చిత్రం తెలుగులో సూపర్ హిట్ సాధించగా కార్తికేయ 2 సినిమాని పాన్ ఇండియా పరంగా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ రెండో భాగం మొదటి భాగం కన్నా ఎక్కువ విజయం సాధించింది. అయితే ఈ రెండో భాగం చివరిలో మూడో భాగం కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. అప్పటినుంచి ఈ సినిమా మూడో భాగం ఎప్పుడు వస్తుందని సినీ ప్రేక్షకులు ఎదురు చూడసాగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో హీరో నిఖిల్ ఈ సినిమా మూడో భాగం గురించి సరికొత్త ఆప్టేట్ పంచుకున్నారు. కార్తికేయ 2 సినిమా నిఖిల్ కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం ఏకంగా 120 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ సినిమా మూడో భాగం మరింత సక్సెస్ సాధిస్తుంది అని ఎదురుచూస్తున్నారు అందరూ. అయితే మూడో భాగం పై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. తాజాగా నిఖిల్ అధికారికంగా తన సోషల్ మీడియాలో దీని గురించి అప్డేట్ ఇచ్చాడు.. నిఖిల్ తన ట్విట్టర్ లో త్వరలోనే కార్తికేయ 3 మొదలు కాబోతుందని హింట్ ఇచ్చాడు.. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.


‘కార్తికేయ మరో అడ్వెంచర్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు’ అంటూ తాను ఉన్న ఒక రెండు ఫోటోలు షేర్ చేస్తూ రాసుకువచ్చారు ఈ హీరో


 



కాగా కార్తికేయ డైరెక్టర్ చందూ మొండేటి ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య తో తండేల్ సినిమాను తెరాకెక్కిస్తున్నారు. ఈ చిత్రం పూర్తవ్వడానికి ఈజీగా మరో రెండు నెలల టైం పడుతుంది. కాబట్టి ఆ సినిమా పూర్తయిన తరువాతే కార్తికేయ మూడో భాగం డైరెక్టర్ మొదలు పెట్టచ్చని వినికిడి. మరోపక్క నిఖిల్ కూడా రెండు సినిమాలలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల తరువాత కార్తికేయ చిత్రం కోసం డేట్స్ ఇవ్వనున్నారట ఈ హీరో. కాబట్టి కార్తికేయ చిత్రం 2025 లేదా 2026లో ఉండొచ్చని సమాచారం.


Also read: Lok Sabha Elections 2024: దేశంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు..


Also read: Bhatti Vikramarka: భట్టి విక్రమార్కకు ఇఫ్తార్ విందులో అవమానం.. వైరల్ గా మారిన వీడియో ఇదే...



 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook