General Elections Schedule 2024: దేశంలో ఐదు రాష్ట్రాలలో ఎన్నికల నగరా మోగింది. చీఫ్ ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ తెలిపారు. తొలిసారి 1.85 కోట్ల మంది తమ ఓటను వినియోగించుకొనునట్లు సీఈసీ వెల్లడించారు. వీరిలో 49.7 కోట్ల మంది పురుషులు, 47.1 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. దేశవ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 55 లక్షల ఈవీఎంలు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. కశ్మీర్లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు.
Read More: Eating More Pythons: జస్ట్ ఫర్ ఏ చెంజ్... కొండ చిలువలను తినాలంటున్న పరిశోధకులు... కారణం ఏంటంటే..?
ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారని చెప్పారు. జూన్ 16వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎన్నికలలో ఎలాంటి ప్రలోభాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఎన్నికల విధులకు వాలంటీర్లు పూర్తిగా దూరంగ ఉంచాలన్నారు. బ్యాంక్ లావాదేవీలపై కూడా నిఘా ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో తప్పుడు ప్రకటనలపై వచ్చే ఫిర్యాదులపై వేగంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదిలా ఉండగా.. ఎన్నికలు నిర్వహించే బూత్ లలో అన్నిరకాల వాష్ రూమ్ ఫెసిలిటీలు, నడవలేని వారికోసం వీల్ చైర్ లు, హెల్ప్ డెస్క్ లు ఉండేలా చూసుకొవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగ నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు మూడు పేపర్లలో తమ గురించిన వివరాలను ప్రచురించాలని ఈసీ స్పష్టం చేసింది.
ఈ క్రమంలో దేశంలోని ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కింలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. టీవీ, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటికి 11 రాష్ట్రాలలో , హింసకు పాల్పడితే నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేస్తామని హెచ్చరించారు. ఈ ఎన్నికలలో 55 లకల ఈవీఎంలను ఉపయోగిస్తున్నట్లు ఈసీ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook