Nikhil Chit Chat With Fans నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్ సినిమా సక్సెస్ మూడ్‌లో ఉన్నాడు. అసలే కార్తికేయ 2 ఫీవర్ ఇంకా నేషనల్ వైడ్‌గా ఉంది. నిఖిల్‌ను పాన్ ఇండియన్ స్టార్‌గా చేసింది కార్తికేయ 2 సినిమా. అనుకోకుండా వచ్చిన ఈ క్రేజ్‌ను నిఖిల్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో క్రేజ్ వచ్చింది కదా?అనే ఉద్దేశ్యంలో అన్ని సినిమాలను డబ్బింగ్ చేసి సొమ్ము చేసుకుందామని చూడటం లేదు. తాజాగా నిఖిల్ ఇదే విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిఖిల్ సోషల్ మీడియాలో నిన్న తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఆస్క్ నిఖిల్ పేరిట కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ సినిమాకు మూడేళ్లు ఎందుకు పట్టింది? అని ఓ నెటిజన్ అడిగితే.. ఇది కరోనా కంటే ముందు ప్రారంభించాం.. మధ్యలో రెండు లాక్డౌన్‌లు, కరోనా వేవ్‌లు వచ్చాయి. అలా ఆలస్యం అయింది.. మొత్తానికి ఈ సినిమా వచ్చింది.. మంచి ఆదరణ దక్కించుకుంది అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.


 



ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో ఎందుకు రిలీజ్ చేయలేదు.. మేం నీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నామని నార్త్ ఆడియెన్స్ అన్నారు. దీనికి నిఖిల్ ఇలా సమాధానం ఇచ్చాడు. ఇది పూర్తిగా తెలుగు వారికోసం, ఇక్కడి ఐడియాతో తీశాం.. పాన్ ఇండియా అని ఈ సినిమాను తీయలేదు.. అప్పుడు మాకు ఆ ఆలోచన లేదు.. అందుకే ఈ సినిమాను తెలుగులో మాత్రమే రిలీజ్ చేశాం.. ఇకపై నేను చేసే ప్రతీ సినిమా పాన్ ఇండియాలోనే వస్తుంది అని నిఖిల్ తెలిపాడు.


మరో నెటిజన్ ఈ సినిమాలోని క్లైమాక్స్ చూస్తే తొలిప్రేమ సినిమాలోని క్లైమాక్స్ షాట్ ముద్దు పెట్టుకునే సీన్ గుర్తుకు వచ్చిందని చెప్పుకొచ్చాడు. దీనికి నిఖిల్ సమాధానం ఇస్తూ.. దండం పెట్టేశాడు.. దయచేసి ఆ సినిమాతో పోల్చొద్దు.. ఏది ఏమైనా మీకు ఆ సినిమాను గుర్తు తెచ్చాం అది చాలంటూ ట్వీట్ వేశాడు.


Also Read : Anchor Suma : మల్లెమాల, ఈటీవికి యాంకర్ సుమ గుడ్ బై?.. అందరూ ఎందుకిలా చేస్తున్నారో


Also Read : Allu Arjun Pushpa : పుష్ప రాజ్‌ను కౌగిట్లో బంధించేసిన స్నేహా రెడ్డి.. అల్లు వారి ప్రేమ.. వైరల్ పిక్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook