Nikhil Siddharth : ఇప్పుడు రీఛార్ట్ అయ్యాడట.. ఇక పనిలో ముగిని తేలుతాడట.. నిఖిల్ పోస్ట్ వైరల్
Nikhil Siddharth Returns From Vaccation నిఖిల్ ప్రస్తుతం తన భార్యతో కలిసి వెకేషన్‌లో బాగానే ఎంజాయ్ చేసినట్టున్నాడు. రీఛార్జ్ అయినట్టుగా పేర్కొన్నాడు. ఇక బ్యాక్ టు వర్క్ అంటూ స్పై, కార్తికేయ సీక్వెల్ గురించి హింట్ ఇచ్చాడు.
Nikhil Siddharth Returns From Vaccation హీరో నిఖిల్‌కు గత ఏడాది బాగానే కలిసి వచ్చింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన నిఖిల్ కార్తికేయ 2 సినిమా దేశ వ్యాప్తంగా సునామినీ క్రియేట్ చేసింది. నార్త్ ఆడియెన్స్‌కు ఈ సినిమా బాగానే ఎక్కేసింది. అక్కడి ప్రేక్షకులకు నచ్చితే బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిసినట్టే. ఇదే కోవలో పుష్ప కూడా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బన్నీని పాన్ ఇండియన్ స్టార్‌ని చేసింది.
ఇప్పుడు నిఖిల్ సైతం కార్తికేయ2తో అక్కడ మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ తరువాత వెంటనే 18pages అంటూ మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను కొట్టేశాడు. అయితే ఈ సినిమాను కూడా నార్త్‌లో విడుదల చేయండని ఆయన అభిమానులు కోరారు. కానీ ఇది కేవలం తెలుగు వారి కోసమే తీసిన సినిమా అని, పాన్ ఇండియా అనే ఉద్దేశ్యంలో తీయలేదని క్లారిటీ ఇచ్చాడు. అందుకే సినిమాను డబ్ చేయడం లేదని చెప్పుకొచ్చాడు.
కానీ ఇకపై తాను చేయబోయే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియన్ రేంజ్‌లోనే ఉంటాయని నిఖిల్ చెప్పుకొచ్చాడు. కార్తికేయ 3, స్పై సినిమాలు పాన్ ఇండియన్ వైడ్‌గా రిలీజ్ అవుతాయని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు నిఖిల్ తన వెకేషన్‌ను పూర్తి చేసుకున్నాడు. ఆ వెకేషన్‌లో ఫుల్ రీఛార్జ్ అయ్యాడట. దీంతో పనిలో మునిగిపోయేందుకు సిద్దంగా ఉన్నాడట. ఈ మేరకు నిఖిల్ షేర్ చేసిన ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది.
నిఖిల్ ప్రస్తుతం స్పై సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత కార్తికేయ మూడో పార్ట్ మీద ఫోకస్ పెట్టేట్టు కనిపిస్తోంది. మొత్తానికి నిఖిల్ మాత్రం ఇప్పుడు తన భార్యతో ఫుల్ ఖుషీగా ఉన్నాడని అర్థమవుతోంది. ఆ మధ్య ఈ ఇద్దరూ విడిపోయారని, వేర్వేరుగా ఉంటున్నారనే పిచ్చి పిచ్చి రూమర్లు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?
Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook