Nikhil Siddharth SPY నిఖిల్ ప్రస్తుతం స్పీడు మీదున్నాడు. కార్తికేయ 2, 18 పేజీస్ అంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేశాడు. దీంతో నిఖిల్, అనుపమలకు మంచి క్రేజ్ వచ్చింది. నేషనల్ వైడ్‌గా నిఖిల్ ఇమేజ్ పెరిగింది. కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు. ఊహించని విధంగా నార్త్‌లో ఈ సినిమా క్లిక్ అయింది. కార్తికేయ 2 సినిమాకు మంచి ఇమేజ్ రావడంతో మూడో పార్ట్‌ను కూడా భారీ ఎత్తున రెడీ చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే నిఖిల్ తనకు వచ్చిన పాన్ ఇండియన్ క్రేజ్‌ను ఊరికే వాడుకోవడం లేదు. నిఖిల్ తన 18 పేజీస్ సినిమాను తెలుగులోనే ప్లాన్ చేశామని, తెలుగు ప్రేక్షకుల కోసం తీశామని అన్నాడు. అన్నట్టుగా ఆ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లోనే విడుదల చేశారు. హిందీలో సినిమాను డబ్ చేయమని అడిగినా కూడా విడుదల చేయలేదు. అయితే నిఖిల్ ఇప్పుడు తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు.


నిఖిల్ స్పై సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుభాష్ చంద్రబోస్ మిస్టరీ డెత్‌ మీద ఈ సినిమా ఉంటుందని అర్థం అవుతోంది. ఈ పాయింట్ మీద ఇది వరకు సినిమాలు, డాక్యుమెంటరీలు లాంటివి వచ్చాయి. మరి స్పై సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు ఈ సినిమా టీజర్, రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు.


Also Read:  Ananya Nagalla : అనన్య తడి అందాలు.. చూస్తే వామ్మో అనాల్సిందే.. అందరి ఫోకస్ అక్కడే


స్పై సినిమా టీజర్‌ను మే 12న రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. అంతే కాకుండా ఈ సినిమాను జూన్ 29న విడుదల చేయనున్నట్టుగా డేట్‌ను ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమా మరోసారి పాన్ ఇండియన్ రేంజ్‌లో ఆడుతుందా? నిఖిల్‌కు బూస్టప్‌ ఇస్తుందా? చూడాలి. కార్తికేయ 2 హిట్టుతో వచ్చిన సక్సెస్ ఈ స్పైతో ముందుకు వెళ్తుందా అన్నది చూడాలి.


Also Read:  Naga Chaitanya : పోతుందని తెలిసి కూడా ప్రమోషన్స్ చేయడం కష్టం!.. థాంక్యూపై నాగ చైతన్య



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook