Extra Ordinary Man Movie First Single: యంగ్ హీరో నితిన్(Nithiin) లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం 'ఎక్ స్ట్రా ఆర్డనరీ మ్యాన్'(Extra Ordinary Man Movie). ఇందులో శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటిస్తోంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్(Extra Ordinary Man Movie First Single) ను రిలీజ్ చేశారు మేకర్స్. డేంజర్ పిల్ల అంటూ సాగే ఈపాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ మూవీకు హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ కు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా..అర్మాన్ మాలిక్ అద్భుతంగా అలరించారు. ఈ సినిమాను డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం నితిన్ తో చేస్తున్న వక్కంతం వంశీ రైటర్ గా తన కెరీర్ ను మెుదలుపెట్టాడు. 2002లో వచ్చిన ఉదయ్ కిరణ్ కలుసుకోవాలని సినిమాతో రైటర్ గా మారాడు. 2018లో అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాతో దర్శకుడి అవతారమెత్తాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. 



Also Read: Adah Sharma hospitalised: 'ది కేరళ స్టోరీ' నటి ఆదాశర్మకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక..


నితిన్ కు 'భీష్మ' తర్వాత సరైన హిట్ లేదు. ఆ సినిమా తర్వాత నితిన్ చేసిన ఏ సినిమాలు పెద్దగా ఆడలేదు. 'చెక్' డిజాస్టర్ గా మిగలగా.. 'రంగ్ దే' యావరేజ్ టాక్ తెచ్చుకుంది.  గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మాచర్ల నియోజకవర్గం' బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసి మీదున్నాడు నితిన్. ఈ నేపథ్యంలో విభిన్న కథలు ఎంచుకుంటున్నాడు. రీసెంట్ గా భీష్మ దర్శకుడు వెంకి కుడుమలతో చిత్రం చేయడానికి పచ్చజెండా ఊపాడు. 



Also Read: Jailer Trailer: రజినీ మార్క్ డైలాగ్స్, యాక్షన్ తో ‘జైలర్’ మూవీ ట్రైలర్.. మీరు చూసేయండి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook