Rajasekhar: నా పేరు సూర్య సినిమాతో మనకు దర్శకుడుగా పరిచయమైన రైటర్ వక్కంతం వంశీ.. ప్రస్తుతం తన అదృష్టాన్ని నితిన్ సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ తో పరీక్షించుకోనున్నారు. శ్రీ లీలా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో హీరో రాజశేఖర్ ముఖ్య పాత్ర చేయడం విశేషం. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో నితిన్ రాజశేఖర్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడుతూ ముందుగా తన సినిమా కోసం పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అలానే ఈ సినిమాని తప్పకుండా థియేటర్స్ లో చూడమని ప్రేక్షకులని కోరారు. ఈ సినిమాలో రాజశేఖర్ స్పెషల్ రోల్ చేయడంతో ఆయన గురించి మాట్లాడుతూ..’ నేను హీరోగా మారడానికి కొన్ని కారణాలు ఉంటే అందులో ముఖ్య కారణం రాజశేఖర్ గారు కూడా. రాజశేఖర్ గారు చేసిన ‘మగాడు’ సినిమాతో మా నాన్న డిస్ట్రిబ్యూటర్ గా మారారు. మా నాన్న డిస్ట్రిబ్యూట్ చేసిన మొదటి సినిమా అది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడం వల్ల చాలా డబ్బులు వచ్చి మా నాన్న ఈ ఫీల్డ్ లో సెటిల్ అయ్యారు. దీంతో నాకు కూడా ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఇటు నేను కూడా హీరోగా వచ్చాను. ఒకవేళ మగాడు సినిమా ప్లాప్ అయి ఉంటే మా నాన్న మళ్ళీ సినిమాల జోలికి వచ్చేవారు కాదేమో, అప్పుడు నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ వచ్చేది కాదేమో.. అందుకే నేను హీరో అవ్వడానికి మా నాన్న సెటిల్ అవ్వడానికి రాజశేఖర్ గారు ప్రధాన కారణం’ అని అసలు విషయం బయటపెట్టారు నితిన్


ఇక ఇప్పటికే విడుదలైన ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ టీజర్, ట్రైలర్, పలు సాంగ్స్ మంచి ఆదరణ పొందగా.. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా నితిన్ కి సూపర్ హిట్ అందిస్తుందో లేదో తెలియాలి అంటే ఈ శుక్రవారం వరకు వేచి చూడాలి.


Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు 


Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook