Rangamarthanda director Krishna Vamsi reacts on Danger Movie sequel: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మరాఠీ సూపర్ హిట్ మూవీ ‘నటసామ్రాట్‌’కు రీమేక్‌గా ఈ చిత్రం వస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటించారు. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అదే సమయంలో డేంజర్‌ లాంటి పరాజయాలు కూడా అందుకున్నారు. అల్లరి నరేశ్‌, కలర్స్ స్వాతి, సాయిరామ్‌ శంకర్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ అందుకోలేకపోయింది. డేంజర్‌ సినిమా విడుదలై.. సుమారు 17 ఏళ్లు అవుతోన్న నేపథ్యంలో సీక్వెల్‌పై కృష్ణ వంశీ స్పందించారు. డేంజర్‌కు స్వీకెల్‌ తెరకెక్కించండి అని ఓ నెటిజన్ ట్వీట్‌ చేయగా.. 'సినిమా ఫ్లాప్‌. అంటే ప్రకారం ప్రేక్షకులు సినిమాని అంగీకరించలేదు. ఇప్పుడు సీక్వెల్‌ ఎలా చేయగలను' అని బదులిచ్చారు. 


మీ ఉద్దేశంలో ఫ్లాప్‌ అంటే ఏంటి అని మరో నెటిజన్‌ అడగ్గా.. డేంజర్‌ సినిమా మా మనుసు దోచుకుంది. కానీ సినిమాపై పెట్టిన డబ్బును  నిర్మాత తిరిగి పొందలేకపోయాడు. దీన్నే ఫ్లాప్‌ అంటారు. డబ్బే రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో ఈ సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ఏ నిర్మాత ముందుకురాడు' అని కృష్ణవంశీ పేర్కొన్నారు. చాలా గ్యాప్ తరవాత కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాపై ఆయన భారీ అంచనాలను పెట్టుకున్నారు. 


Also Read: టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ టూర్‌లకు భారత జట్టు ఇదే!  


Also Read: బికినీ అందాలతో సెగలు రేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఆ హాట్ నెస్ అంతకుమించి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook