Dhanush Raayan Update : సినిమాల స్కోప్ పెరుగుతున్న కొద్దీ.. ఇండస్ట్రీలతో నిమిత్తం లేకుండా అన్ని భాషల సినిమాలు ఆదరణ అందుకుంటున్నాయి. భాషతో సంబంధం లేకుండా హీరోలు..అన్ని ఇండస్ట్రీలలో నటిస్తున్నారు. చాలామంది తమిళ హీరోలకు.. తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి హీరోలలో తమిళ్ స్టార్ హీరో ధనుష్ కూడా ఒకరు. ఆయన తమిళ్లో చేసిన.. చాలా వరకు సినిమాలు తెలుగులో డబ్ అవ్వడమే కాకుండా మంచి కలెక్షన్స్ కూడా అందుకుంటున్నాయి. మరోపక్క మలయాళం హీరోలు.. కూడా తెలుగులో బాగా పాపులర్ అవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన కెరీర్ లో ధనుష్ ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కేవలం నటుడుగానే కాకుండా.. దర్శకుడుగా కూడా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు ధనుష్. ధనుష్ చేసిన సినిమాలు ఎన్నో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. రీసెంట్ గా వెంకీ అట్లూరు.. దర్శకత్వంలో సార్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ధనుష్ మరింత దగ్గరయ్యాడు. ఈ మూవీలో అతని నటన విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.


ఒకపక్క హీరోగా చేస్తూ మరోపక్క ధనుష్ దర్శకుడుగా కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ధనుష్ డైరెక్టర్‌గా రాయాన్ అనే సినిమాను తెరకెక్కించారు. జూలై 26న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద.. మంచి సక్సెస్ సాధించింది. ఈ చిత్రానికి ఇప్పటికే సుమారు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు అయినట్లు టాక్. ఈ మూవీలో ధనుష్ తమ్ముడిగా.. సందీప్ కిషన్ ఓ కీలక పాత్ర పోషించారు. ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళిలు ఈ మూవీ లో ముఖ్య పాత్రలు పోషించారు.


ఈ మాస్ కుటుంబ కథా చిత్రం ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేస్తోంది. ఆకట్టుకునే కథ, అద్భుతమైన నటనతో.. ఈ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ప్రేక్షకుల మనసుకు హత్తుకుపోయే.. పాత్రలలో ధనుష్ తమ్ముడి పాత్ర ఒకటి.అయితే ఈ సినిమాలో సందీప్ కిషన్‌‌ధనుష్ తమ్ముడుగా చేసిన పాత్ర‌కు మొదట అతన్ని అనుకోలేదట. నిజానికి ఈ పాత్ర కోసం ముందు విష్ణు విశాల్‌ని అనుకున్నారు. కానీ అదే సమయానికి విష్ణు విశాల్.. బాగా బిజీగా ఉండడంతో అతను ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోయారట. దాంతో సెకండ్ ఆప్షన్ కింద సందీప్ కిషన్ ఈ మూవీకి తీసుకున్నారు. అయితే సందీప్ ఈ చిత్రంలో చేసిన.. పాత్ర అతని కెరీర్‌కి చాలా ప్లస్ పాయింట్ అయింది. మొత్తానికి ఆ ఒక్క కారణం వల్ల విష్ణు విశాల్ 100 కోట్ల సినిమా పోగొట్టుకున్నారు.


Also Read: Revanth MLAs Meet: బండ్ల షాక్‌తో రేవంత్‌ రెడ్డి అలర్ట్‌.. పార్టీ మారొద్దని అర్థరాత్రి ఎమ్మెల్యేలతో మంతనాలు


Also Read: Constable Aspirants: అర్ధరాత్రి మళ్లీ నిరుద్యోగుల ఆందోళన.. దిల్‌సుఖ్‌నగర్‌ దిగ్బంధం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook