NTR 31: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ..
NTR 31: ప్రస్తుతం టాలీవుడ్ సహా ప్యాన్ ఇండియా ఆడియన్స్ ఎక్కువగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి. ఇప్పటికే ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఎపుడు పూజా కార్యక్రమాలతో ఎపుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించాయి.
Jr NTR and Prashanth Neel film Launch: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఎపుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా 'సలార్ -2' కారణంగా లేట్ అయింది. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ‘సలార్ 2’ ను పక్కనపెట్టి ఎన్టీఆర్ సినిమాను ముందు తెరకెక్కించే యోచనలో ఉన్నారు. ముందుగా ఈ సినిమాను ఆగష్టు 8న పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవుతాయని చెప్పారు. కానీ కాలేదు. ఈ రోజు ఈ సినిమా రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది. ఈ సినిమా పూజా కార్యక్రమానికి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటు తారక్ తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లు హాజరయ్యారు. మరోవైపు ప్రశాంత్ నీల్ తన కుటుంబంతో హాజరయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు 'డ్రాగన్' అనే పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషలకు ఈ టైటిల్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని భావిస్తున్నారు. RRR మూవీ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాలపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్..కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర పార్ట్ -1'మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది.మొదటి పార్ట్ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతుంది. రెండో పార్ట్ వచ్చే యేడాది విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. మరోవైపు ‘డ్రాగన్’ మూవీని సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి .. వచ్చే యేడాది ద్వితీయార్ధంలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం.
ఒకవైపు ఎన్టీఆర్ సినిమా చూస్తూనే.. ప్రభాస్ ‘సలార్ పార్ట్ 2’ మూవీని కంప్లీట్ చేసే యోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నాడు. మరోవైపు ఎన్టీఆర్.. దేవర్ సినిమా రెండు పార్టులను కంప్లీట్ చేసినట్టు సమాచారం. మరోవైపు నవంబర్ వరకు ‘వార్ 2’ మూవీ కంప్లీట్ చేయనున్నాడు. ఈ నెలలోనే ఎన్టీఆర్, హృతిక్ లపై కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారట. అంతేకాదు ఈ చిత్రాన్ని 2025 ఆగష్టు 15న విడుదలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
మొత్తంగా ఎన్టీఆర్.. ఎలాంటి ఈగోలను పక్కన పెట్టి.. మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్.. అట్లీతో పాటు కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్‌లతో సినిమాలు చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ చిత్రాల ప్లానింగ్ అదుర్స్ అనేలా ఉంది.
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter