Jr NTR About Thalapathy Vijay: దళపతి విజయ్ డ్యాన్సుల మీద సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్, వచ్చే మీమ్స్ గురించి తెలియని వారు ఉండరు. ఈమధ్యనే GOAT సినిమా తర్వాత ఈ కామెంట్స్ మరీ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ సినిమాలో విజయ్ స్టెప్ లను ఎంతగా ట్రోలింగ్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ అన్న చర్చలు మొదలైన ప్రతీ సారి విజయ్ మీద ట్రోలింగ్ జరగటం కూడా మొదలు అవుతుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ మాత్రం విజయ్ డ్యాన్సుల్ని తెగ పొగిడేశారు. దేవర ప్రమోషన్స్ కోసం ప్రస్తుతం ఎన్టీఆర్ చెన్నైలో ఉన్న సంగతి తెలిసిందే.


దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ చెన్నై లో ఆడియెన్స్ కోసం తమిళంలోనే మాట్లాడారు. ఇక జాన్వీ తమిళ్ ఫ్లూయెన్సీ చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. ఎన్టీఆర్ ఎలాగూ తమిళ్ లో బాగానే మాట్లాడతారు అని తెలిసిందే. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డైరెక్ట్ తమిళంలోనే ఓ సినిమా వెట్రిమారన్ తో చేస్తా అని చెప్పడం చర్చనీయాంశం కూడా అయ్యింది.  


ఇక ఇప్పుడు విజయ్ డ్యాన్సుల గురించి కూడా తారక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. "డ్యాన్స్ అంటే బాడీ ఊపేయడం కాదు.. ఫైట్స్ చేసినట్టు, ఫీట్స్ చేసినట్టు డ్యాన్స్ ఉండకూడదు.. డ్యాన్స్ అంటే డ్యాన్స్‌ లానే ఉండాలి" అని తారక్ అన్నారు.. ఎఫర్ట్ లెస్‌లా డ్యాన్స్ చేయాలని. విజయ్ అలానే చేస్తాడంటూ ఎన్టీఆర్ కితాబిచ్చారు.


కష్టపడి స్టెప్పులు వేసినట్టుగా కాకుండా విజయ్ చాలా ఈజ్‌తో చేస్తాడని అన్నారు. ఎక్స్ ట్రాలు లేకుండా చాలా కూల్‌గా, స్టెప్పులు వేస్తాడని ప్రశంసల వర్షం కురిపించారు. అంతే కాకుండా విజయ్ డ్యాన్సులకు పెద్ద అభిమానని అని అన్న ఎన్టీఆర్.. ఒకప్పుడు ఫోన్లో ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం.. కానీ ఇప్పుడు మాట్లాడుకుని చాలా కాలం అయ్యింది అన్నారు.


ఎన్టీఆర్ లాంటి స్టార్ డ్యాన్సర్.. విజయ్ డ్యాన్సుల గురించి ఇలా చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ వీడియో కూడా బాగానే ట్రెండ్ అవుతోంది. మరోవైపు దేవర సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది.


Also Read: Rahu Transit 2024 Good Effect: ఈ రాశులవారికి.. 2025 జనవరి వరకు డబ్బుల వర్షమే..


Also Read: Amala Paul: పండుగ నాడు కొడుకు ముందే అతడికి లిప్ కిస్ పెట్టిన హీరోయిన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.