NTR rejected Buchi Babu’s script: ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రకరకాల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండేవారు. ఒక దర్శకుడికి మరో దర్శకుడికి సంబంధం లేకుండా ఒక కథకు మరో కథకు సంబంధం లేకుండా ఇలా కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉండేవారు. అందుకే ఆయన పెద్ద సినిమాలతో పాటు చిన్న దర్శకలతో కూడా పనిచేస్తారని పేరు ఉంది. అయితే ఇదంతా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మారిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు ఆస్కార్ కు నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కధనాలు ప్రచురించిన క్రమంలో  ఆ క్రేజ్ ను అలాగే కొనసాగించాలని అవసరమైతే క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేయాలి తప్ప తగ్గించుకునే ప్రయత్నం చేయకూడదని ఆయన బలంగా ఫిక్స్ అయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుకే కథల సెలక్షన్ విషయంలో ఆయన చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతెందుకు కొరటాల శివతో సినిమా చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆయన స్క్రిప్ట్ ఫైనల్ చేయడానికి ఆరు నెలలు పట్టింది. ముందుగా చెప్పిన కథ అయినా దానికి అనేక మార్పులు చేర్పులు చేసి కొరటాల శివ తీసుకువస్తే గాని జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. కేవలం మార్పులు చేర్పులు చేసేందుకే ఆరు నెలలు పట్టింది. ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 పేరిట ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.


అయితే ఈ సమయంలో మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ బుచ్చిబాబుతో కలిసి చేయాలి అనుకున్న ప్రాజెక్టు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ముందుగా లైన్ చెప్పినప్పుడు ఎన్టీఆర్ కాస్త ఎక్సైట్ అయ్యాడు, బుచ్చిబాబుతో సినిమా చేయాలని అనుకున్నాడు.. మొత్తం కథ ప్రిపేర్ చేసుకోమని పంపించారు కానీ బుచ్చిబాబు మొత్తం కథ సిద్ధం చేసి ఎన్టీఆర్ కు పంపిన తర్వాత ఎన్టీఆర్ దాన్ని చూసి సంతృప్తి పడలేదని తెలుస్తోంది..


తాజాగా అందుతున్న సమాచారం మేరకు జూనియర్ ఎన్టీఆర్ బుచ్చిబాబును ఇంటికి పిలిపించుకుని తాను నీతో కలిసి సినిమా చేయలేనని చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి రిస్క్ చేసే పరిస్థితుల్లో లేనని అంతా ఓకే అనుకున్నప్పుడు తానే పిలిచి సినిమా చేస్తానని బుచ్చిబాబుకు హామీ ఇచ్చాడట. ఈ క్రమంలో బుచ్చిబాబు ఆ కథ తీసుకుని రాంచరణ్ దగ్గరికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ కు ఆ కథ అంతగా నచ్చకపోవడంతో మరో కథ చెప్పారట.


ఆ చెప్పిన రెండో కథ రామ్ చరణ్ కి నచ్చడంతో దాని ఫైనల్ కాపీ సిద్ధం చేసుకుని రమ్మని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతానికి ఎన్టీఆర్ ప్లాన్స్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతానికి కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలతో తన క్రేజ్ ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్.


Also Read: Anusha Shetty: ఎన్టీఆర్ తల్లికి, నాగశౌర్య కాబోయే భార్య అనూషకు రిలేషన్ ఏంటో తెలుసా?


Also Read: Dil Raju Politics: ప్రెస్ మీట్ తరువాత స్పీడ్ పెంచిన దిల్ రాజు.. వాళ్లు చెప్తే వినేస్తారా? అసలు వాళ్లు చెప్పాలి కదా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook