NTR - Tillu Square Success Meet: సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్'.  డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈసినిమాకు మల్లిక్ రామ్ దర్శకుడు. మరోవైపు సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే సమకూర్చడం విశేషం. తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు.. దాదాపు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. హనుమాన్ తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ శిల్పా కళా వేదికలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అథితిగా హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ వేడుకలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో పాటు విశ్వక్‌సేన్ కూడ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్.. ఈ సినిమా సక్సెస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిద్దును ఎపుడు కలవలేదు. కరోనా తర్వాత కలిశాను.  టిల్లు సినిమా చూసిన తర్వాత అతను బయట కూడా అలాగే ఉంటాడని ఊహించుకున్నాను. కానీ అతనికి సినిమా తప్ప మరో ధ్యాస లేదు. ఈ సినిమా చూసిన తర్వాత నవ్వు ఆపుకోలేకపోయాను. ఇలాంటి అద్భుతమైన పాత్రలను ఎన్నో సిద్దు చేయాలని కోరుకుంటున్నాన్నారు.


ఈ సందర్భంగా దేవర సినిమా గురించి మాట్లాడారు ఎన్టీఆర్. అంతేకాదు ఈ సినిమా లేటైనా.. అభిమానులు కాలర్ ఎగరేసేలా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. అంతేకాదు ఈ వేదికగా దేవర సినిమా డైలాగ్ చెప్పారు. 'కల కనడానికి ఓ ధైర్యం ఉండాలి. ఆ కలను సార్ధకం చేసుకోవడానికి భయం ఉండాలి'.   టిల్లు స్క్వేర్ బృందం భయపడుతూ .. ఎంతో శ్రద్ధతో తెరకెక్కించడం వలన ఈ సినిమా ఇంత బాగా వచ్చిందన్నారు. అందరికీ కష్టం ఒక్కటే. అందరు కష్టాన్ని నమ్ముకోవాలి. విశ్వక్ సేన్, సిద్దులపై తనకు ఎంతో నమ్మకం ఉందన్నారు. ఈ వేడుకలో అనుపమ పరమేశ్వరన్, నేహా శెట్టిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు మల్లిక్ రామ్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.


Also Read: Shobha Karandlaje: ప్రచారంలో అపశ్రుతి.. కేంద్ర మంత్రి కారు తగిలి కార్యకర్త మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook