NTR’s Evaru meelo Koteeswarulu show: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారనే వార్త తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సదరు టీవీ ఛానెల్.. మే 3వ వారం నుంచి ఎవరు మీలో కోటీశ్వరులు షోను ప్రసారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అదే సమయంలో ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రోమోలు కూడా ప్రసారం చేసింది. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎవరు మీలో కోటీశ్వరులు షో మే నెల నుంచి జూన్ నెలకు వాయిదాపడినట్టు తెలుస్తోంది. జూన్ నెలలో ఎప్పటి నుంచి షో ప్రసారం అవుతుందనే విషయంలో ఇంకా ఓ స్పష్టతకు రాలేదని ఫిలింనగర్ టాక్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : RRR movie release date: ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్‌పై మళ్లీ క్లారిటీ 


మరోవైపు ఆర్ఆర్ఆర్ షూటింగ్‌తో ఎన్టీఆర్ బాగా అలసిపోతున్నాడని, ఆలియా భట్ (Alia Bhatt), అజయ్ దేవ్‌గన్ లాంటి (Ajay Devgn) వాళ్లు కొవిడ్-19 బారినపడటంతో ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతోందని సమాచారం.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook