Happy Birthday Ajay Devgn: పుట్టినరోజు సందర్భంగా అజయ్ దేవగణ్‌కు ఆర్ఆర్ఆర్ సర్‌ప్రైజ్

Ajay Devgn Motion Poster From RRR: ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ నుంచి నేడు ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చేసింది. గతంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పుట్టినరోజు సందర్భంగా వారి మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 2, 2021, 01:38 PM IST
Happy Birthday Ajay Devgn: పుట్టినరోజు సందర్భంగా అజయ్ దేవగణ్‌కు ఆర్ఆర్ఆర్ సర్‌ప్రైజ్

First Look Motion Poster Of Ajay Devgn: టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ నుంచి నేడు ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చేసింది. గతంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పుట్టినరోజు సందర్భంగా వారి మోషన్ పోస్టర్, టీజర్‌లు, ఫస్ట్ లుక్ లాంటివి ఎన్నో ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ విడుదల చేసింది. 

నేడు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అజయ్ దేవగణ్ పాత్రను రివీల్ చేస్తూ ఓ సర్‌ప్రైజ్‌ను దర్శకుడు రాజమౌళి తీసుకొచ్చారు. అజయ్ దేవగణ్‌కు పుట్టినరోజు కానుకను ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ అందించింది. ఆర్ఆర్ఆర్(RRR Movie) మూవీలో కీలకపాత్ర పోషిస్తున్న అజయ్ దేవగణ్ పాత్రను తెలిపేలా ఓ మోషన్ పోస్టర్‌ను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ విడుదల చేసింది.

Also Read: Dadasaheb Phalke Award: రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, సూపర్ స్టార్ ఫ్యాన్స్ హర్షం

బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా వస్తున్న సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. అక్టోబర్ 13న విజయదశమి సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల తేదీని సైతం గతంలోనే ప్రకటించారు. దసరా కానుక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా, ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో ఉన్న పోస్టర్‌ను ఆ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశాడు. మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కావడంతో అంతకంటే ఒకరోజు ముందుగానే చెర్రీ ఫ్యాన్స్‌ కోసం Ram Charan Birthday కానుకగా ట్విటర్ ద్వారా జక్కన్న ఈ పోస్టర్‌ని విడుదల చేశాడు. ది మ్యాన్ ఆఫ్ బ్రేవరి, హానరి, ఇంటిగ్రిటీ ప్రజెంటింగ్ మై అల్లూరి సీతారామరాజు అంటూ రాజమౌళి తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News