Nusrat Jahan: తన బిడ్డకు తండ్రి ఎవరో రివీల్ చేసిన ఎంపీ, నటి నుస్రత్ జహాన్
Nusrat Jahan: టీఎంసీ ఎంపీ, బెంగాల్ నటి నుస్రత్ జహాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని నుస్రత్ రివీల్ చేశారు. దీంతో పలు ఊహగానాలకు చెక్ పెట్టినట్లయింది.
Nusrat Jahan: తన బిడ్డకు తండ్రి ఎవరనే విషయంలో బెంగాలి నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్(Nusrat Jahan) క్లారిటీ ఇచ్చారు. ఆమె ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అనే వార్తలు గుప్పుమన్నాయి. దానికి కారణం ఆమె భర్త నిఖిల్ జైన్‌తో విడిగా ఉండటమే.
నిఖిల్ ఇంటి నుంచి బయటకు వచ్చాక తాను గర్భవతినని ఆమె వెల్లడించారు. ఈ క్రమంలో.. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరనే అంశంపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ఇక బిడ్డ పుట్టాక సైతం నుస్రత్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. అయినా ఆమె నోరు విప్పలేదు.
Also Read: Jr Ntr Movie: కొరటాల శివ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్
తాజాగా తన కుమారుడి జనన ధృవీకరణ పత్రంలో తన భాగస్వామి పేరుగా నటుడు యష్ దాస్ గుప్తా(Yash Dasgupta) పేరును చేర్చడంతో విమర్శలకు తెరపడినట్లైంది. కాగా గతేడాది లాక్‌డౌన్ టైమ్‌లో `ఎస్‌ఓఎస్ కోల్‌కతా` సినిమా షూటింగ్ టైమ్‌లో నుస్రత్, యష్ దాస్ గుప్తా ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారు. అయితే యష్ దాస్ గుప్తాకు ఆల్రెడీ పెళ్లి అయింది. ముంబైకి చెందిన ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్న శ్వేత సింగ్‌ను యష్ పెళ్లి చేసుకున్నాడని, వీరికి పదేళ్ల బాలుడు కూడా ఉన్నాడని సమాచారం.
ఆ వివాహం చెల్లదు: నుస్రత్
జూన్ 19, 2019లో నుస్రత్, వ్యాపారవేత్త నిఖిల్ జైన్(Nikhil Jain) టర్కీలో అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నవంబర్ 2020 నుంచి విభేదాల కారణంగా వారిద్దరూ విడిగా ఉంటున్నారు. అనంతరం 2021లో భారతీయ చట్టాల ప్రకారం జైన్‌తో తన వివాహం చెల్లదని నటి వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook