Sharwanand, Ritu Varmas Oke Oka Jeevitham Movie Trailer out: టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ గ‌త కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. శ‌ర్వా చివరగా న‌టించిన 'ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు' సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. అంతకుముందు వచ్చిన 'మహాసముద్రం' కూడా నిరాశనే మిగిల్చింది. దాంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని విన్నూత కథను ఎంచుకున్నాడు. శ్రీకార్తిక్ ద‌ర్శ‌క‌త్వంలో శర్వా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 'ఒకే ఒక జీవితం'. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 9న‌ తెలుగుతో పాటు త‌మిళంలో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 'ఒకే ఒక జీవితం' సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఈరోజు ట్రైల‌ర్‌ను వదిలారు. 2 నిమిషాల 30 సెకండ్ల నిడివి గల ఈ వీడియో.. శ‌ర్వానంద్ మ్యూజిక్ కాంపిటేష‌న్‌ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సీన్‌తో ఆరంభం అయింది. అయితే కాంపిటేష‌న్‌లో శ‌ర్వా పాడ‌లేక ఇబ్బంది పడుతుంటాడు. మ్యారేజ్ బ్రోక‌ర్‌గా వెన్నెల కిషోర్ ఆకట్టుకున్నాడు. ప్రియ‌ద‌ర్శి అయితే ఎలాగైన ఒక ప‌ర్‌ఫెక్ట్ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాల‌ని చూస్తుంటాడు. 



ప్రముఖ నటుడు నాజ‌ర్  'ఒకే ఒక జీవితం' సినిమాలో సైంటిస్ట్‌గా క‌నిపించ‌నున్నారు. టైం ట్రావెల్ మిష‌న్‌తో శ‌ర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియ‌ద‌ర్శిని వాళ్ళ బాల్యంలోకి పంపిస్తాడు. శర్వాకు బాల్యంలో ఎదో జరిగిందని ట్రైల‌ర్ చూస్తే తెలుస్తుంది. ట్రైల‌ర్‌లో అక్కినేని అమ‌ల మెరిశారు. శ‌ర్వానంద్ త‌ల్లిగా ఆమె నటించారు. ఈ సినిమాలో శ‌ర్వాకు జోడీగా రీతూవ‌ర్మ న‌టించారు. డ్రీమ్ వారియ‌ర్స్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్‌ఆర్ ప్ర‌కాష్ బాబు, ఎస్‌ఆర్ ప్ర‌భు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Also Read: మైండ్ బ్లాకింగ్ కాంబో.. ఒకే ఫ్రేమ్‌లో రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, రష్మిక, త్రిష, దీపికా! 


Also Read: పవర్‌స్టార్‌కు సెలబ్రిటీల విషెస్‌.. వైరల్ అవుతోన్న బండ్ల గణేశ్‌ ట్వీట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook