Mega Blockbuster: మైండ్ బ్లాకింగ్ కాంబో.. ఒకే ఫ్రేమ్‌లో రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, రష్మిక, త్రిష, దీపికా!

Rohit Sharma Film Debut, Rohit Sharma act in Mega Blockbuster. బాలీవుడ్ సినిమాలో రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ నటిస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 2, 2022, 02:41 PM IST
  • బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న రోహిత్ శర్మ
  • ఒకే ఫ్రేమ్‌లో రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ
  • ఒకే ఫ్రేమ్‌లో రష్మిక, త్రిష, దీపికా
Mega Blockbuster: మైండ్ బ్లాకింగ్ కాంబో.. ఒకే ఫ్రేమ్‌లో రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, రష్మిక, త్రిష, దీపికా!

Rohit Sharma, Sourav Ganguly act in Mega Blockbuster: ఒకప్పుడు మైదానంలో సిక్సర్లతో హోరెత్తించిన సౌరవ్ గంగూలీ.. ప్రస్తుతం హోరెత్తిస్తున్న రోహిత్ శర్మలు సినీ రంగ ప్రవేశం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాలీవుడ్ సినిమాలో గంగూలీ, రోహిత్ నటిస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. 'మెగా బ్లాక్‌బస్టర్'లో రోహిత్ లీడ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడట. అదే విధంగా దాదా కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారట. దీనికి సంబంధించిన పోస్టర్ శుక్రవారం విడుదలైంది. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అయింది. 

హాస్యనటుడు కపిల్ శర్మ తన కొత్త ప్రాజెక్ట్ 'మెగా బ్లాక్ బస్టర్'కి సంబందించి అప్‌డేట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ట్రైలర్‌ను సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. 'ఇది నా అభిమానుల కోసం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అని కపిల్ శర్మ పేర్కొన్నారు. దీపికా పదుకొణె కూడా మెగా బ్లాక్‌బస్టర్ పోస్టర్‌ను పంచుకున్నారు. మెగా బ్లాక్‌బస్టర్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో 'సర్‌ప్రైజ్' అని క్యాప్షన్ ఇచ్చారు. రోహిత్ శర్మ, రష్మిక మందన్న, త్రిష కూడా తమ సోషల్ మీడియా ఖాతాలలో 'మెగా బ్లాక్‌బస్టర్' పోస్టర్‌ను పంచుకున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rohit Sharma (@rohitsharma45)

'మెగా బ్లాక్‌బస్టర్' పోస్టర్‌ను రోహిత్ శర్మ పంచుకుని.. 'నా కడుపులో సీతాకోకచిలుకలు పరుగెడుతున్నాయి. నా అరంగేట్రం కొత్తగా ఉంది. మెగా బ్లాక్‌బస్టర్ పోస్టర్‌ సెప్టెంబర్ 4న విడుదల కానుంది' అని పేర్కొన్నారు. ఈ పోస్టర్‌లో హాఫ్ షర్ట్‌తో సాఫ్ట్‌వేర్ గెటప్‌లో రోహిత్ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇది సినిమానా లేక టెలివిజన్ షోనా అని తెలియాల్సి ఉంది. దీనిపై ఓ క్లారిటీ రావాలంటే ట్రైలర్  విడుదల అయ్యేవరకు వేచిచూడాల్సిందే. ఏదేమైనా క్రికెటర్లు, నటీనటుల కాంబో మైండ్ బ్లాకింగ్ అనే చెప్పాలి. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trish (@trishakrishnan)

Also Read: అప్పుడు ఇప్పుడు సేమ్ టు సేమ్.. రికార్డులు తిరగరాస్తోన్న 'జల్సా' రీ రిలీజ్‌!

Also Read: తొడకొట్టాడు తెలుగోడు.. అభిమానులకు పండగే పో! గూస్‌బంప్స్ తెస్తోన్న 'పవర్ గ్లాన్స్'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News