Mahesh Babu: ఆరడుగుల అందగాడు, టాలీవుడ్ హ్యాండ్‌సమ్ పర్సన్ మహేశ్ బాబుకు మరో కీర్తి చేరింది. దక్షిణాది నటుల్లో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం. ప్రపంచంలోనే అరుదైన స్థానం లభించింది. అదేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ ప్రిన్స్‌గా ప్రిన్స్ మహేశ్ బాబుగా అందరికీ తెలుసు.పేరుకు తగ్గట్టుగానే ప్రిన్స్. ఆరడుగులపైనే ఉన్న స్మైలీ లుకింగ్ హ్యాండ్‌సమ్ పర్సన్. అందంతో పాటు అద్బుతమైన చరిష్మా అతనికే సొంతం. నటనలో..డ్యాన్సింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా అప్పట్లో అందగాడే. మెగా హిట్స్‌ను సొంతం చేసుకున్న మహేశ్ బాబు ఖాతాలో మరో అరుదైన కీర్తి వచ్చి చేరింది. ప్రపంచంలోని అందమైన మగవాళ్ల జాబితా 2021లో పదో స్థానంలో నిలిచాడు. దక్షిణాది నుంచి ఈ జాబితాలో చోటుచేసుకున్న ఏకైన నటుడు మహేశ్ బాబు (Mahesh Babu) కావడం విశేషం. టాప్ 10 మోస్ట్ హ్యాండ్‌సమ్ పర్సన్స్ ఆఫ్ ది వరల్డ్ 2021 (Most Handsoe Persons of the World 2021) లో పదవ స్థానంలో నిలిచాడు. అటు ఉత్తరాది నుంచి ఏకైక నటుడు హృతిక్ రోషన్ 3వ స్థానంలో నిలిచాడు. ఇక నెంబర్ వన్ స్థానంలో బ్యాట్‌మ్యాన్ హీరో, హాలీవుడ్ నటుడైన రాబర్ట్ ప్యాటిన్సన్ నిలిచాడు. ఈ ఘనత సాధించిన ఏకైక దక్షిణాది నటుడు మహేశ్ బాబు మాత్రమే.


ప్రస్తుతం మహేశ్ బాబు ఇప్పుడు కీర్తి సురేశ్‌తో కలిసి సర్కారువారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. గీతా గోవింద్ ఫేమ్ దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 1, 2022న విడుదల కానుంది. 


Also read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వాయిదా పడనుందా?.. అసలు కారణం ఇదే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి