Jr NTR and Ram Charan's RRR Movie relese postponed :యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్ (రౌద్రం రణం రుధిరం). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఆర్‌ఆర్‌ఆర్ (RRR Movie) సినిమా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ను విడుదల చేస్తుండటంతో.. అన్ని భాషల్లోనూ ప్రమోషన్ల స్పీడు పెంచారు. కొత్త పోస్టర్లు, గ్లింప్స్, మేకింగ్ వీడియోలు, ఇంటర్వ్యూలతో చిత్ర బృందం సినిమాపై మరింత ఆసక్తి నెలకొల్పుతోంది.
అయితే తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా వాయిదా (RRR Movie Postponed) పడుతున్నట్టు వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రస్తుతం కరోనా వైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ (Omicron).. దేశంలో వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కొత్త కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇక నూతన సంవత్సరంకు సమయం దగ్గరపడుతుండంతో ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలను కూడా అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించేందుకు సిద్దం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్ విడుదల (RRR Relese) నాటికి రాష్ట్రాల్లో ఆంక్షలు ఉండే అవకాశం ఉందనే అనుమానాలతో సినిమా విడుదలను వాయిదా వేయాలని చిత్ర బృందం బావిస్తోందట.
Also Read: Cinema Ticket Price: తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంపు- కొత్త ధరలు ఇవే..!
అయితే ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై (RRR Movie Postponed) సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందో స్పష్టంగా తెలియదు. ఈ విషయంపై ఇటివరకు చిత్ర బృందం స్పందించలేదు. విడుదలకు సమయం ఉండడంతో త్వరలోనే ఆర్‌ఆర్‌ఆర్ యూనిట్ స్పందించే అవకాశం ఉంది. ఏదేమైనా నెట్టింట వస్తున్న వార్తలతో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. తారక్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్, చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ అలియా భట్ కనిపించనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో అజయ్ దేవ్‌గణ్, శ్రియ శరన్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి