Adipurush New Release Date : ప్రభాస్ ఆదిపురుష్‌ సినిమా మీద దేశమంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. ఫస్ట్ లుక్ ఎప్పుడు టీజర్ ఎప్పుడూ అని ఎదురుచూశారు. కానీ టీజర్ వచ్చాక అందరూ పెదవి విరిచారు. పిల్లలు చూసే కార్టూన్, చిన్నప్పుడు వచ్చిన డిస్నీ బొమ్మల్లా గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ ఉందని ట్రోల్స్ చేశారు. మొబైల్లో చూసేందుకు సినిమాను తీయలేదని, థియేటర్లో త్రీడీలో చూస్తే అదిరిపోతుందని, అందుకే సినిమాను తీశానని ఓంరౌత్ అన్నాడు. ముందు నుంచి కూడా ఈ సినిమాను ఐమాక్స్, త్రీడీల్లోనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ లెక్కన చూస్తే సిటీల్లో మాత్రమే సినిమాను విడుదల చేయాల్సి ఉంటుంది. ఊర్లలో, టౌన్స్‌లో మల్టీ ప్లెక్స్, త్రీడీ స్క్రీన్లు ఉండవు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విషయాలను పట్టించుకోకుండా ఆదిపురుష్‌ టీం ఇష్టానుసారంగా సినిమాను తీసేసింది. అయితే ఓం రౌత్ ఇప్పుడు తన కళ్లు తెర్చుకున్నాడు. వాస్తవాలను గ్రహించేందుకు ప్రయత్నించాడు. ఈ సినిమాను అన్ని స్క్రీన్లలో విడుదల చేసేందుకు అనుగుణంగా మార్పులు చేస్తున్నాడు. వీఎఫ్‌ఎక్స్ విషయంలోనూ మార్పులు చేస్తున్నాడట. ఈ సినిమాను అందరికీ చూపించాలనే ఉద్దేశ్యంతోనే రిపేర్లు చేస్తున్నట్టుగా ప్రకటించాడు.


 



అందుకే ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ చిత్రం సంక్రాంతికి రావడం లేదట. వేసవి చివర్లో అంటే జూన్ 16వ తేదీన ఈ చిత్రం రాబోతోందంటూ కొత్త డేట్‌ను ప్రకటించారు. మరి ఈ సినిమాను పూర్తిగా మార్చేసి.. వీఎఫ్ఎక్స్ పనుల కోసం దాదాపు వంద కోట్లు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, వానర సైన్యం, ఆంజనేయుడు ఇలా ఏ ఒక్కరి లుక్ కూడా సరిగ్గా లేకపోవడంతో.. ఈ రేంజ్‌ ట్రోల్స్, నెగెటివిటీ వచ్చేశాయి. మరి వీటిపై ఓం రౌత్ ఎలాంటి హోం వర్క్ చేస్తాడో.. లుక్స్ ఎలా మారుస్తాడో? షూటింగ్ మళ్లీ చేస్తాడా? అన్నది చూడాలి.


Also Read : Brahmastra Streaming on OTT : ఓటీటీలో బ్రహ్మస్త్ర సినిమా.. రణ్‌బీర్ కపూర్‌ని అలియా భట్ ఎన్ని సార్లు పిలిచిందంటే?


Also Read : Bigg Boss Satya : సత్య, గీతూలకు ఇప్పటికైనా తెలిసి వస్తుందా?.. కళ్లు తెరుస్తారా?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook