Bigg Boss Satya : సత్య, గీతూలకు ఇప్పటికైనా తెలిసి వస్తుందా?.. కళ్లు తెరుస్తారా?

Bigg Boss satya and geetu : బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం రెడ్ టీం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. శ్రీహాన్, సత్య పిల్ల చేష్టలు, గీతక్క పిచ్చి లూప్స్, స్ట్రాటజీలతో తన ఇమేజ్ తనే ఇంకా దిగజార్చుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2022, 04:51 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం సందడి
  • ఇంట్లోంచి బయటకు వచ్చేసిన గలాట గీతూ
  • ఇప్పటికైనా సత్య కళ్లు తెర్చుకుంటాయా?
Bigg Boss Satya : సత్య, గీతూలకు ఇప్పటికైనా తెలిసి వస్తుందా?.. కళ్లు తెరుస్తారా?

Bigg Boss satya and geetu : బిగ్ బాస్ తొమ్మిది వారానికి ఆడియెన్స్ కోరుకున్నది, అనుకున్నది జరుగుతోంది. మొదటి వారం నుంచి గీతూని ఎలిమినేట్ చేయాలని ఆడియెన్స్ బాగానే పరితపించారు. కానీ బిగ్ బాస్ టీం మాత్రం ఆమెను కాపాడుతూనే వచ్చింది. ఆమె సైతం ఆటల్లో అంతో ఇంతో యాక్టివ్‌గా ఉంది. అలాంటి ఓ పిచ్చి, వింత కారెక్టర్ కూడా బిగ్ బాస్ ఇంట్లో ఉంటే బాగుంటుందని టీం భావించినట్టుంది. అందుకే గీతూ మీద ఎంత నెగెటివిటీ పెరుగుతున్నా కూడా ఆమెను మాత్రం ఇంకా ఇంకా ఎంకరేజ్ చేసినట్టున్నారు.

ఆమె పిచ్చి బాగా ముదిరిపోయింది. బిగ్ బాస్ టీం, బిగ్ బాస్, నాగార్జునను కూడా లెక్కచేయనంత మూర్ఖంగా ప్రవర్తించింది గీతూ. ఇక ఎనిమిదో వారంలో పడ్డ దెబ్బకు గీతూ ఏ మాత్రం మారలేదు. బుద్ది బలం ఉపయోగించండని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడంతో గీతూ తెగ రెచ్చిపోయింది. తనకు మాత్రమే బుద్ది ఉందని, మిగతా వాళ్లకు లేదని భ్రమలో బతుకుతుంటుంది. అలా ఈ మిషన్ పాజిబుల్ టాస్కులో గీతూ తెగ రెచ్చిపోయింది.

రెడ్ టీం లీడర్‌గా గీతూ చాలా ఓవర్ చేసింది. సత్య, శ్రీహాన్, గీతూలే తెలివైన వాళ్లని అనుకున్నారు. ఇష్టం వచ్చినట్టుగా ఆడారు. వీక్ నెస్ వీక్ నెస్ అంటూ బాలాదిత్య, ఇనయలను టార్గెట్ చేశారు. టాస్కులో గెలిచామని, తమ టీం సభ్యులు బంగారుకొండలని, తానేం చెబితే అది చేశారంటూ గీతూ తెగ సంబరపడిపోయింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News