Om Raut on Adipurush VFX ప్రభాస్ ఆదిపురుష్‌ సినిమా కోసం దేశమంతా కూడా ఎంతగానో ఎదురుచూడసాగింది. అయితే ఆదిపురుష్‌ టీజర్ రావడంతో కథ అంతా మారింది. అందులోని వీఎఫ్‌ఎక్స్ చూసి జనాలు నవ్వుకున్నారు. రాముడి లుక్ సరిగ్గా లేదంటూ, రావణుడు ఇలా ఉంటాడా? హన్మంతుడు ఇలా కనిపిస్తాడా? వానర సైన్యం ఏంటి? ఇలా ఉంటుందా? అంటూ నానా రకాలుగా కామెంట్లు వేశారు. ఇక రాముడు, ఆంజనేయుడు చర్మంతో తయారు చేసిన వస్తువులను ధరిస్తారా? అలా ఎందుకు చూపించారు? అంటూ నానా రకాల ప్రశ్నలు సంధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో ఆదిపురుష్ టీం తన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. ఈ సినిమాను మొబైల్స్ కోసం తీయలేదని, థియేటర్‌లో చూసేందుకు తీశామని, త్రీడీలో చూస్తే వచ్చే అనుభూతి వేరంటూ ఓం రౌత్ తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ చివరకు ఆదిపురుష్‌కు రిపేర్లు మొదలుపెట్టేశారు.


 



ఆదిపురుష్ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ను మార్చేస్తారని టాక్ వచ్చింది. ఇంకో వంద కోట్లు పెట్టి రిపేర్లు చేస్తున్నారంటూ గాసిప్స్ వినిపించాయి. అయితే తాజాగా ఓం రౌత్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా విషయంలో కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. మేం వాటిని స్వీకరించారం. అయితే వీఎఫ్ఎక్స్ టీం కొన్ని చోట్ల అద్భుతంగా పని చేసింది.


ఇంకోన్ని చొట్ల మేం కరెక్షన్స్ చేయాల్సి ఉంది.. వాటిని మేం సరి చేస్తున్నాం.. మన తీసే సినిమా విషయంలో చివరి నిమిషం వరకు మనం కష్టపడాల్సిందే..మన ప్రొడక్ట్ బాగా రావడానికి మనం చివరి వరకు ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది.. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం.. నేను ఏ ఒక్కరినీ నిరాశపర్చను. నేటి యువతకు, ప్రపంచానికి మన రాముడిని చూపించాలని, ఆయన గురించి చెప్పాలని చేస్తున్న ప్రయత్నం ఇది అంటూ ఓం రౌత్ చెప్పుకొచ్చాడు.


Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?


Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి