One Plus One Offer to Vinaro Bhagyamu Vishnu Katha: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చి తనదైన శైలిలో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఎస్ఆర్ కళ్యాణమండపం అనే ఒక సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన తర్వాత అనేక సినిమాలు చేశాడు. కానీ ఒక్కటి కూడా కలిసి రాలేదు. చివరికి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో చేసిన వినరో భాగ్యము విష్ణు కథ కాస్త పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆ సినిమా కంటే ఒక్కరోజు ముందు విడుదలైన సార్ సినిమా టాక్ తో పాటు వసూళ్లు కూడా బాగుండడంతో ఈ సినిమా వసూళ్ళ విషయంలో కాస్త వెనకబడింది. ఈ నేపథ్యంలోనే సినిమా యూనిట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే బుధవారం, గురువారం ఈ సినిమా టికెట్లకు సంబంధించి ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం సింగిల్ థియేటర్లకు మాత్రమే అని మల్టీప్లెక్స్ థియేటర్లకు ఈ ఆఫర్ వర్తించదని తెలుస్తోంది.


వాస్తవానికి హిందీలో రిలీజ్ అయినా పఠాన్ మేనియాని తట్టుకునేందుకు అలవైకుంఠపురంలో హిందీ రీమేక్ సినిమా విడుదలైన రోజు కూడా ఇలాంటి ఆఫరే ప్రకటించారు. ఆ సినిమా మేకర్స్. షహజాదా పేరుతో కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన హిందీ థియేటర్లలో విడుదలైంది.


కానీ పఠాన్ సినిమా గట్టి పోటీ ఇస్తూ ఉండడంతో ఈ సినిమాకి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు మేకర్లు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించినా ప్రేక్షకులు ధియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు. ఇప్పటికే అల వైకుంఠపురంలో సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండడంతో ప్రేక్షకులు దాదాపు దాన్ని చూసి ఉంటారని అందుకే ఈ సినిమాని థియేటర్లకు వెళ్లి చూసేందుకు ఆసక్తి చూపించలేదని భావిస్తున్నారు. మొత్తం మీద వినరో భాగ్యము విష్ణుకథ టీం ఎప్పుడు ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
Also Read: Raveena Tandon Photos: ముదురు వయసులో రవీనా హాట్ ట్రీట్.. జాకెట్ కూడా లేకుండా!


Also Read: Taraka Ratna Death: తారక రత్న మోకిల నివాసానికి రాని తల్లితండ్రులు, ఫిలిం ఛాంబర్ కు ఎందుకు వచ్చారంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook