Operation Raavan: రక్షిత్ అట్లూరి హీరోగా రాధికా శరత్ కుమార్  లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ ‘ఆపరేషన్ రావణ్’. ఈ మూవీని  ధ్యాన్ అట్లూరి నిర్మించారు.  న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు, తమిళ బాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  సంగీర్తన విపిన్ కథానాయికగా నటించింది. ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా  థియేట్రికల్ రిలీజై మంచి ఆదరణ పొందింది “ఆపరేషన్ రావణ్” సినిమా. తాజాగా ఈ చిత్రం నవంబర్ 2 నుంచి ఆహాలో డిజిటల్ ప్రీమియర్ స్ట్రీమింగ్ అవుతోంది.  అంతేకాదు ఫస్ట్ డే నే ఈ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ సినిమా థియేట్రికల్ గా కాకుండా ఓటీటీలో మరింత ఆదరణ పొందడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ఆపరేషన్ రావణ్’ చిత్రంలో  సినిమాలో రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ లీడ్ రోల్స్ లో నటించారు.   సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియెన్స్ ను “ఆపరేషన్ రావణ్” సినిమా నచ్చుతుంది. ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ సినిమా సైకోటిక్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పక చూడాల్సిందే. ఆహా ఓటీటీ విషయానికొస్తే.. ఇందులో తెలుగు సినిమాలతో పాటు షోలతో అలరిస్తోంది.  


‘ఆపరేషన్ రావణ్’ సినిమాలో  రక్షిత్ అట్లూరితో పాటు సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి శరవణ వాసుదేవన్ సంగీతం అందించారు. లక్ష్మీ లోహిత్ పూజారి డైలాగ్స్ రాసారు. ఈ సినిమాలో నాని చడిడిశెట్టి ఫోటోగ్రఫీ అందించారు. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని వెంకట సత్య దర్శకత్వం వహించారు.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter