Ori Devuda OTT release date locked: యంగ్ హీరో విశ్వక్సేన్ ఇటీవల అర్జున్ సర్జ సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఒక పక్క విశ్వక్ సేన్ మరో పక్క అర్జున్ సర్జా ఇద్దరూ వేర్వేరుగా ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు కానీ అసలు ఏం జరిగిందనే విషయం మీద పూర్తి అవగాహన లేదు. ఇంత వివాదం జరుగుతుంటే విశ్వక్సేన్ తన వెర్షన్ వినిపించి సైలెంట్ అయిపోయాడు. ఆ సంగతి పక్కన పెడితే విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా సినిమా ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ అవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జిన్నా, సర్దార్, ప్రిన్స్ వంటి సినిమాలతో పోటీపడుతూ రిలీజ్ అయిన ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ లభించింది. విశ్వక్సేన్ హీరోగా మిధిలా పార్కర్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాను తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఓ మై కడవలె అనే సినిమాకి తెలుగు రీమేక్ గా రూపొందించారు. వెంకటేష్ ఒక దేవుడి పాత్రలో నటించిన ఈ సినిమాకు ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ గా వ్యవహరించిన అశ్విన్ మారిముత్తు ఈ సినిమాకి కూడా డైరెక్షన్ చేశారు.


అంతేకాక తమిళంలో పనిచేసిన టీమ్ అంతటినీ తీసుకువచ్చి తెలుగులో కూడా పనిచేయించారు. పి వి పి ప్రొడక్షన్స్, దిల్ రాజు బ్యానర్ల మీద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఆహా వేదికగా స్ట్రీమ్ చేసేందుకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 11 అంటే రేపు శుక్రవారం నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.


తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయగా తెలుగులో కూడా ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ అయితే దక్కించుకుంది. అయితే నాలుగు సినిమాలతో పోటీ పడడం వలన ఈ సినిమాని సర్దార్ కలెక్షన్స్ విషయంలో క్రాస్ చేసింది. సర్దార్ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే లభించాయి. తెలుగులో రూపొందిన ఓరి దేవుడా  సినిమా తమిళ మాతృక నుంచి బేస్ చేసుకుని చేసినా ఈ సినిమాకి కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి.


Also Read: Samantha Tension: మరో క్యాంపులో మంటలు పెట్టేసిన సమంత.. ఆ ప్రకటన వెనుక పరమార్ధం అదేనా?


Also Read: Chiru Vs Balayya: అడకత్తెరలో పోక చెక్కలా మైత్రీ సంస్థ.. ఇద్దరు హీరోల మధ్య సతమతం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook