Samantha Tension: మరో క్యాంపులో మంటలు పెట్టేసిన సమంత.. ఆ ప్రకటన వెనుక పరమార్ధం అదేనా?

 Director Gunasekhar in Tension: తన హెల్త్ అప్డేట్ తో ఇప్పటికే పలువురిని టెన్షన్ పెట్టేసిన సమంత ఇప్పుడు మరో క్యాంపులో కూడా టెన్షన్ పెట్టిందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే 

Last Updated : Nov 10, 2022, 12:13 PM IST
Samantha Tension: మరో క్యాంపులో మంటలు పెట్టేసిన సమంత.. ఆ ప్రకటన వెనుక పరమార్ధం అదేనా?

Shaakuntalam​ Team in Tension Over Samantha Health: నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత గురించి ఎలాంటి వార్త వచ్చినా అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత హీరోయిన్ గా నటించిన యశోద సినిమా నవంబర్ 11వ తేదీన అంటే మరొక రోజులో తెలుగు ప్రేక్షకుల ముందుకే కాదు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతోంది. హరి, హరీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలలో నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణ ప్రసాద్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

నిజానికి ఈ సినిమాను సమంత ప్రమోట్ చేయడం చాలా అవసరం కానీ ప్రస్తుతం సమంత ఉన్న అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఆమె ప్రమోషన్స్ కు వెళ్లడం అనేది సాధ్యమయ్యే పనికాదు. ఈ నేపథ్యంలోనే తెలుగు కోసం సుమతో, తమిళం కోసం మరో యాంకర్ తో ఇలా ఒక్కో భాష కోసం ఒక్కో యాంకర్ తో సమంత ఇంటర్వ్యూలు ఇచ్చింది. వాటినే ఆయా భాషల్లో పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. వాస్తవానికి ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి సమంత స్వయంగా వెళ్లి అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడితే అన్ని భాషల్లోనూ ఆ ఇంపాక్ట్ వేరుగా ఉండేది.  కానీ ఆమె అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో కేవలం ఇంటికే పరిమితమై ఇక్కడి నుంచి ఈ వీడియోలు రిలీజ్ చేస్తే అది పెద్దగా ఇంపాక్ట్ ఉండదు.

అయితే యశోద సినిమా రిలీజ్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో చాలా టెన్షన్ గా ఉందని ఒక రకంగా ఎగ్జయిటెడ్ గా ఉన్నానని ఆమె ఒక పోస్ట్ పెట్టారు. మీ అందరికీ యశోద నచ్చాలని గట్టిగా కోరుకుంటున్నా, మా దర్శకులకు నిర్మాత అలాగే ఇతర నటీనటులు సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్లు అందరికీ మంచి వైబ్స్ రావాలని కోరుకుంటున్నాను వారు కూడా నాలాగే రేపటి తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్ని ఫింగర్స్ క్రాస్ అయ్యాయి అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇదంతా బాగానే ఉంది కానీ సమంత యశోద సినిమా పక్కన పెడితే ఆమె అనారోగ్య కారణాలతో కేవలం విజయ్ దేవరకొండ ఖుషి టీమ్ మాత్రమే కాదు శాకుంతలం టీం కూడా చాలా ఇబ్బందుల్లో ఉందని తెలుస్తోంది.

యశోద సినిమా లాగానే శాకుంతలం సినిమాలో కూడా సమంత సినిమా మొత్తానికి పెద్ద అట్రాక్షన్. గుణశేఖర్ డైరెక్షన్లో శకుంతల దుష్యంతుల కథను ఆయన ఒక దృశ్య కావ్యంగా తెరకెక్కించారు. సినిమా మొత్తానికి సమంత ఒక్కతే చెప్పుకో దగ్గ స్టార్. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ లాంటి వాళ్ళు ఉన్నారు కానీ సమంత సినిమాకి మెయిన్ పాయింట్. రుద్రమదేవి తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గుణశేఖర్ కు ఈ సినిమా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆయనకు ఇది దర్శకత్వ పరంగానే కాదు సొంత నిర్మాణం కావడంతో ఈ సినిమా మీద ఆయన భారీగా ఆశలు పెట్టుకున్నారు. సమంత స్వయంగా వచ్చి ప్రమోషన్స్ లో పాల్గొనడం ఆయనకు చాలా అవసరం.

వాస్తవానికి ఆ సినిమా నవంబర్ 11వ తేదీ ఏరోజైతే యశోద రిలీజ్ అవుతుందో అదే రోజున విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమాని త్రీడీలో రూపొందిస్తున్నాము అందుకే వాయిదా వేస్తున్నామని కొన్నాళ్ల క్రితం అధికారికంగా ప్రకటించారు. కానీ సమంత అనారోగ్యమే ఈ సినిమా వాయిదా వేయడానికి అసలు కారణమని తెలుస్తోంది. సమంత మునుపటిలా మామూలు మనిషి అయ్యి ప్రమోషన్స్ లో పెద్ద ఎత్తున పాల్గొంటే కానీ తమ సినిమాకి వర్కౌట్ అవ్వదని గుణశేఖర్ భావిస్తున్నారట. అలా కాకుంటే యశోద సూపర్ హిట్ అయ్యి ప్రేక్షకులు సమంతను మరోసారి నెత్తిన పెట్టుకుంటే అప్పుడు కొంచెం ధైర్యం చేసి ఆమె బయటకు రాకపోయినా సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేయవచ్చని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సమంత కోసం గుణశేఖర్ అండ్ టీం మొత్తం కూడా ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

Also Read: Allu Aravind Fourth Son: అల్లు అరవింద్ కు నలుగురు కుమారులు.. నాలుగో కుమారుడు ఎవరో తెలుసా?

Also Read: Janhvi Kapoor Latest Photos: సౌదీ అరేబియాలో అరేబియన్ హార్స్ లా జాన్వీ కపూర్ ఫోజులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News