RRR Hero Jr NTR react on Nattu Nattu Song Dance performance at Oscar 2023 Stage: ప్రస్తుతం భారతీయ సినీ ప్రియుల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని 'నాటు నాటు' సాంగ్ గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. నాటు నాటు సాంగ్ ప్రతిష్టాత్మక 'ఆస్కార్‌' బరిలో ఉంది. 95వ ఆస్కార్‌ నామినేషన్‌లో 'ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌' విభాగంలో పోటీపడుతోంది. దాంతో భారత దేశానికి అత్యున్నత పురస్కారాన్ని తీసుకొస్తుందనే ఆశ అందరిలో ఉంది. కేవలం భారతీయులే కాదు.. పలు హాలీవుడ్‌ ప్రముఖులు సైతం నాటు నాటు పాటకే పురస్కారం అంటూ అంచనా వేస్తున్నారు. ఆస్కార్‌ ఫలితాలు ఆదివారం ఉదయం 5.30 వెలుబడనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి స్వరపరిచిన నాటు నాటు పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. ప్రేమ్‌ రక్షిత్‌ నృత్య దర్శకత్వం వహించిన ఈ పాటను.. కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు. ‘గోల్డెన్‌గ్లోబ్‌’ సహా పలు అంతర్జాతీయ పురస్కారాలు గెలుచుకున్న ఈ పాటకు టాలీవుడ్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ స్టెప్పులు వేశారు. ఈ పాత దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలూగించింది. దీంతో ఈ పాటకు ఆస్కార్‌ పురస్కారం రావడం దాదాపు ఖాయమైందని ప్రపంచ సినీ వర్గాలు అంటున్నాయి. ఇటు ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్ కూడా నాటు నాటు పాట ఆస్కార్‌ తీసుకొస్తుందని చాలా నమ్మకంగా ఉంది. 


2023 మార్చి 12న అమెరికాలో ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్ అమెరికాలో సందడి చేస్తోంది. హీరోలు ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌.. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. సింగర్స్ కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అమెరికాలో ఉన్నారు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు వరుసగా పలు హాలీవుడ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. 


కీరవాణి, కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌లు ఆస్కార్‌ స్టేజ్‌పై నాటు నాటు పాట పాడుతుండగా.. ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌లు కాలు కదపనున్నారని సమాచారం. అయితే తాజాగా దీనిపై ఎన్టీఆర్‌ క్లారిటీ ఇచ్చాడు. సింగర్స్ స్టేజ్‌పై నాటు నాటు పాటను పాడనున్నారని, డాన్స్ పర్ఫామెన్స్‌ మాత్రం ఉండదని స్పష్టం చేశాడు. దాంతో ఆస్కార్‌ స్టేజ్‌పై ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ల డాన్స్ చూద్దామనుకున్న భారత అభిమానులకు నిరాశే ఎదురైంది. 


బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ (BEST ORIGINAL SONG):


  • అప్లాజ్‌ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమెన్‌)

  • హోల్డ్‌ మై హ్యాండ్‌ ( టాప్‌గన్‌: మావెరిక్)

  • లిఫ్ట్‌ మీ అప్‌ (బ్లాక్‌ పాంథర్‌: వాకండ ఫరెవర్)

  • నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్‌)

  • దిస్ ఈజ్‌ ఏ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)


Also Read: Oscar 2023 Nominations: 2023 ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ సహా అన్ని విభాగాలకు చెందిన లిస్ట్ ఇదే!  


Also Read: H3n2 Virus: H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ నుంచి రక్షణ పొందడానికి ఇలా చేయండి! ఇలా లక్షణాలు ఉంటే జాగ్రత్తలు తప్పనిసరి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.