OTT Releases: దసరా సెలవులు ముగిసిపోయి స్కూల్స్, కాలేజెస్, ఆఫీస్ ఇలా ఎవరికివారు బిజీ అయిపోయారు. ఈసారి దసరాలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పెద్దగా సినిమాలు లేవు. విజయదశమికి విడుదలైన వేట్టయాన్, విశ్వం, జనక సినిమాలు తప్ప మరేవీ లేవు. అయితే ఓటీటీలో మాత్రం పెద్దఎత్తున సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలవుతున్నాయి. ఇంకా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్యకాలంలో ఓటీటీలకు క్రేజ్ పెరుగుతోంది. నచ్చిన సినిమా నచ్చినట్టుగా, నచ్చిన సమయంలో, నచ్చిన భాషలో చూసే వీలుండటంతో థియేటర్ రిలీజ్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. భారీ బడ్జెట్ సినిమాలు కూడా ప్రారంభంలో తప్ప ఆ తరువాత ప్రేక్షకుల ఆదరణకు నోచుకోవడం లేదు. కారణం ఓటీటీలో చూసే వీలుండటమే. అదే విధంగా ఈ వారం కూడా భారీగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేయనున్నాయి. రేపు శుక్రవారం ఏకంగా 15 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 


అమెజాన్ ప్రైమ్‌లో...


అక్టోబర్ 18వ తేదీన కల్ట్ ఫ్రెంచ్ వెబ్‌సిరీస్, కడైసి ఉలగ పొర్ తమిళ సినిమా, స్నేక్స్ అండ్ ల్యాడర్స్ తెలుగు డబ్బింగ్ వెబ్‌సిరీస్, ద డెవిల్స్ అవర్ సీజన్ 2 ఇంగ్లీషు వెబ్‌సిరీస్, ద ఆఫీస్ ఆస్ట్రేలియా ఇంగ్లీషు వెబ్‌సిరీస్, ద పార్క్ మేనియక్ పోర్చుగీస్ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి. 


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో..


అక్టోబర్ 18న 1000 బేబీస్ తెలుగు డబ్బింగ్ వెబ్‌సిరీస్, రైవల్స్ ఇంగ్లీషు వెబ్‌సిరీస్, రోడ్ డైరీ ఇంగ్లీషు సినిమా విడుదలవుతున్నాయి.


నెట్‌ఫ్లిక్స్‌లో...


అక్టోబర్ 18వ తేదీన ఫ్యాబ్యులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్ ఇంగ్లీషు వెబ్‌సిరీస్, ద మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్ఓస్, ఉమన్ ఆఫ్ ద అవర్ ఇంగ్లీషు సినిమా విడుదలవుతున్నాయి.


జియో సినిమాలో..


అక్టోబర్ 18వ తేదీన క్రస్పీ రిస్తే హిందీ సినిమా, అక్టోబర్ 19న హ్యాపీస్ ప్లేస్ ఇంగ్లీషు వెబ్‌సిరీస్, హిస్టీరియా ఇంగ్లీష్ సినిమా


ఆహాలో..


అక్టోబర్ 19వ తేదీన రైడ్ తెలుగు డబ్బింగ్ సినిమా స్ట్రీమింగ్ కానుంది.


Also read: Ap Heavy Rains Alert: ఏపీకు మళ్లీ రెడ్ అలర్ట్, మరో అల్పపీడనం భారీ వర్షాలు జాగ్రత్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.