Upasana Konidela: తాజాగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికీ పద్మ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి చలన చిత్ర రంగం నుంచి అది తెలుగు నాట చిరంజీవిని పద్మ విభూషణ్ అవార్డుతో కేంద్రం గౌరవించింది. అటు తెలుగు వారైన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కూడా పద్మ విభూషణ్‌తో గౌరవించింది కేంద్రం. ఈ సారి ఈ పద్మ అవార్డుల్లో దక్షిణాది వారికే ఎక్కువ దక్కాయి. అందులో రాజకీయ కారణాలతో పాటు అసలుసిసలు వారికీ నరేంద్ర మోదీ ప్రభుత్వం గుర్తించి మరి పద్మ అవార్డులను కట్టబెట్టింది. ఇక చిరంజీవికి పద్మ అవార్డు రావడంపై ఆమె కోడలు ఉపాసన సామాజిక మాధ్యమం వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మన దేశంలో 140 కోట్ల జనాభాలో కేవలం 336 మంది వ్యక్తులకు మాత్రమే అందిన అరుదైన గౌరవం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ అవార్డును మా తాతగారైన అపోలో ప్రతాప్ రెడ్డికి 2010లో కేంద్రం పద్మ విభూషణ్‌తో గౌరవించింది. అంతకు ముందు 1991లో కేంద్రం పద్మభూషణ్‌తో గౌరవించింది. ప్రతాప్ రెడ్డి దేశ ఆరోగ్య రంగంలో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కీలక మార్పులు చేశారు. ఆయన దూరదృష్టి దేశ ఆరోగ్య సంరక్షణలో కీలక భూమిక వహించింది. తాజాగా చిరంజీవికి కేంద్రం 2024 యేడాదికి గాను పద్మ విభూషణ్‌తో గౌరవించింది. ఈ అవార్డును మా కుటుంబం నుంచి ఇద్దరు ఈ అరుదైన గౌరవం దక్కడంపై ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తాతయ్య ప్రతాప్ రెడ్డితో మావయ్య చిరంజీవి ఉన్న ఫోటోను అభిమానులకు షేర్ చేసింది.


చిరంజీవి విషయానికొస్తే..  ఒక సామాన్య మధ్య తరగతి నుంచి తెలుగు సినీ రంగంలో తన కంటూ ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఈయన కెరీర్ విషయానికొస్తే.. స్వయంకృషి, స్వీయప్రతిభతో సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించారు. బాక్సాఫీసు రికార్డులు సృష్టించిన మేరు నగధీరుడు. ఆశేష అభిమానులకు మెగాస్టార్ చిరంజీవిగా అభిమానుల గుండెల్లో కొలువైనాడు.చిరు తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మిస్సైల్ లా దూసుకువచ్చి..అదే వేగంతో మెగాస్టార్ ఎదిగారు. టాలీవుడ్ మూవీ పొటెన్షియాలిటీని పెంచిన బిగ్‌బాస్. స్టార్ ఇమేజ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన కథానాయకుడు. నటుడిగా 150పైగా చిత్రాలు చేసారు. అంతేకాదు సినీ కెరీర్ పీక్స్‌లో ఉండగానే..రాజకీయబాట పట్టాడు.ఎమ్మెల్యే అయ్యాడు. ఆపై రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఆపై కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం పాలిటిక్స్‌ను ఒదలిపెట్టి సినిమాలే లోకంగా బతుకున్నాడు. తాజాగా కేంద్రం ఈయన్ని దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించడంపై అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


ఇదీ చదవండి: మీపేరు ఈ 2 అక్షరాలతో మొదలవుతుందా? అయితే, మీలవ్ బ్రేకప్..


ఇదీ చదవండి:  ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook