`పద్మావతి` సినిమా విడుదల వాయిదా
ఫ్లాష్.. ఫ్లాష్.. పద్మావతి చిత్రం విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వయాకామ్ 18 నిర్ణయించింది.
ఫ్లాష్.. ఫ్లాష్.. పద్మావతి చిత్రం విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వయాకామ్ 18 నిర్ణయించింది. ఇటీవల ఈ సినిమాపై అనేక అభ్యంతరాలు వెల్లువెత్తుతున్న తరుణంలో చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నారు. కర్ణిసేన ఇప్పటికే పద్మావతి సినిమాపై గుర్రుగా ఉంది. సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని ఇప్పటికే దేశవ్యాప్త ఆందోళనలు చేస్తోంది. ఇలాంటి సమయంలో చిత్ర విడుదల జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, లేనిపోనివి జరిగితే పరిస్థితి దారుణంగా తయారవుతుందని భావించి చిత్రం విడుదలను ఆపేస్తున్నట్లు ప్రకటించారు. సినిమాలో జలాలుద్దీన్ ఖిల్జీ పాత్ర పోషిస్తున్న నటుడు రాజా మురద్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కారణం ఏదైనా పద్మావతి సినిమా విడుదల వాయిదా తప్పడం లేదని, ఇది దురదృష్టకరమని ఆయన చెప్పారు. షెడ్యూల్ ప్రకారం పద్మావతి సినిమా దేశవ్యాప్తంగా డిసెంబర్ 1 న విడుదల కావాల్సి ఉంది.