Padutha Theeyaga Tv Show Telugu: తెలుగులో అనేక టీవీ షోలు వస్తున్నాయి. అయితే చాలాకొన్ని షోలు మాత్రమే చాలా ఏళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంతోమంది సింగర్స్‌కు వేదికగా నిలిచిన పాడుతా తీయగా షో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మరో మైలురాయికి చేరుకున్న ఈ షో.. త్వరలో సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకోనుంది. సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న తొలి షోగా పాడుతా తీయగా కార్యక్రమం నిలవనుంది. ఈ షో ఇప్పటికే 23 సీజన్లు పూర్తి చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Karunakar reddy: తిరుమలలో హైటెన్షన్.. శ్రీ వారి ఆలయం దగ్గర సంచలన వ్యాఖ్యలు చేసిన  భూమన కరుణాకర్ రెడ్డి..  వీడియో ఇదే..


త్వరలోనే 24వ సీజన్‌ ప్రారంభంకానుంది. ఈ షోకు సపరేట్ ఫ్యాన్ బేస్, ట్రాక్ రికార్డు ఉంటుంది. 1996లో ప్రారంభమైన ఈ షో.. ఈటీవీ టీవీ షోలో టాప్‌లో ఉంది. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 500 మందికిపైగా కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఎందరో సింగర్స్.. నేడు టాప్ సింగర్స్ సినిమాల్లో రాణిస్తున్నారు. ఈ షోపై స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెరగని ముద్ర వేశారు. న్యాయనిర్ణేతగా ఆయన ఇచ్చిన సూచనలు సింగర్స్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం ఈ షోను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్‌ ముందుండి నడిపిస్తున్నారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. ఎస్పీబీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ జడ్జ్‌గా ఉంటున్నారు. ఆయనతోపాటు సునీత, విజయ్ ప్రకాష్ వంటి ప్రముఖ సింగర్లు జడ్జ్‌లుగా ఉంటూ యువ సింగర్లకు తమ సంగీత జ్ఙానం అందజేస్తున్నారు.


ఈటీవీతో పాడుతా తీయగా కార్యక్రమానికి వీడదియలేని అనుబంధం ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 1100 ఎపిసోడ్స్‌కిపైగా ప్రసారం అయ్యాయి. 1996 నుంచి 2000 ఏడాది వ‌ర‌కు ప్రసారం కాగా.. మధ్యలో కొన్నేళ్లు నిలిచిపోయింది. 2007 మళ్లీ ప్రారంభమైన తరువాత నాన్‌స్టాప్‌గా కంటిన్యూ అవుతోంది. ఈ షోకు చాలామంది సినీ తారలు గెస్టులుగా హాజరయ్యారు. చిరంజీవి, ఇళ‌యారాజా, కీర‌వాణి, జాన‌కి, సుశీల‌, దేవిశ్రీప్ర‌సాద్‌ వంటి ఎందరో స్టార్లు పాల్గొన్నారు. ఎన్నో టీవీ షోలు వచ్చినా.. పాడుతా తీయగా షోకు మాత్రం ఇంకా క్రేజ్‌ తగ్గలేదు.  


Also Read: Rhea singha: గుజరాత్ భామను వరించిన మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.