Rhea singha: గుజరాత్ భామను వరించిన మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా..?

Miss universe india 2024: ఈ సంవత్సరం మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటాన్ని రియా సింఘా గెలుచుకున్నారు. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024 గ్రాండ్‌ ఫినాలో రియా విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవలం చేసుకున్నట్లు తెలుస్తోంది.

1 /8

మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024 కార్యక్రమంలో ఆదివారం రాజస్తాన్ లోని జైపూర్లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకల్లో భారత్ నుంచి గుజరాత్ యువతి పాల్గొని సత్తా చాటింది.  రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024 గ్రాండ్‌ ఫినాలే పోటీల్లో.. రియా విజేతగా నిలిచి మనదేశం గర్వపడేలా చేసింది.  

2 /8

ఈ టైటిల్ విజయంతో..  రియా ప్రస్తుతం ప్రపంచ మిస్‌ యూనివర్స్‌ 2024 పోటీలో భారత్‌ తరఫున బరిలో నిలచే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్ తరపున ఈసారి ఎలాగైన.. ప్రపంచ వేదికమీద మరో కిరిటీం సొంతం చేసుకొవాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు.

3 /8

మిస్ యూనివర్స్ గెల్చుకున్న తర్వాత.. రియా సింఘా ఎంతో భావోద్వేగానికిగురైనట్లు తెలుస్తోంది. తన దీని కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చారు.మిస్‌ యూనివర్స్ ఇండియా టైటిల్‌ను గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇదితనకు మరింత బూస్టింగ్ ఇచ్చిందని కూడా ఈ భామ చెప్పుకొచ్చింది.

4 /8

మరోవైపుఈ కార్యక్రమానికి..న్యాయనిర్ణేతగా.. మిస్ యూనివర్స్ ఇండియా 2015 ఊర్వి రౌటేలా పాల్గొన్నారు. ఈ సంవత్సరం భారతదేశం మళ్లీ మిస్ యూనివర్స్ కిరీటాన్ని పక్కాగా గెల్చుకుంటుందని కూడా పేర్కొన్నారు. అలాగే.. మిస్‌ యూనివర్స్‌ ఇండియా పోటీలో అమ్మాయిలుందరూ చాలా కష్టపడ్డారని, చివరి వరకు పోటీలు ఫుల్ టఫ్ గా నడిచిందని కూడా చెప్పారు.  

5 /8

 రియా సింఘా ది గుజరాత్ రాష్ట్రం. ఆమె 18 ఏళ్ల వయసునుంచి రియా సింఘాకు అందాల పోటీలపై ఆసక్తి ఉండేదని ఆమె చెప్పుకొవచ్చింది.  ఫైనల్ లో..  51 మంది ఫైనలిస్టులను వెనక్కినెట్టి.. రియా సింఘా పోటీ పడుతూ ఆమె ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 

6 /8

భవిష్యత్తులో జరగబోయే మిస్ యూనివర్స్ కోసం మరింతగా కష్టపడుతానని కూడా రియా చెప్పారు.ఈ టైటిల్  గెలుచుకొవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు గుజరాత్ లో రియా కుటుంబ సభ్యులు, ఆమె ఫ్రెండ్స్ సంబరాల్లో మునిగిపోయారని తెలుస్తోంది.  

7 /8

ఇదిలా ఉండగా.. మనదేశం నుంచి ఈసారి ఎలాగైన రియా సింఘా తప్పకుండా.. కిరిటం కొల్లగొడుతుందని కూడా చాలా మంది కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మరోవైపు పీఎం మోదీ సొంత రాష్ట్రం నుంచి వచ్చిన యువతి.. ఈ విధంగా టైటిల్ సాధించడం వల్ల పీఎం కూడా గర్వకారణం అని చెప్తున్నారు. 

8 /8

మిస్ యూనివర్స్ కోసం.. తమ కూతురు డైట్ విషయంలో, ఎక్సర్ సైజ్ విషయంలో ఎంతో కష్టపడేదని కూడా ఆమె ఫ్యామిలీ, ఫ్రెండ్స్ చెప్పుకొచ్చారు. ఈసారి మిస్ యూనివర్స్ కిరీటం గెల్చుకొవాలన్నదే తమ కూతురు కళ్ల ముందు ఉన్న టార్గెట్ అని వారంతా చెప్తున్నారు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x