Salaar Movie Trends: కొత్త ఏడాది తొలిరోజే ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న ప్రభాస్ కొత్త సినిమా సలార్
Salaar Movie Trends: పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు కొత్త ఏడాదిని సరికొత్తగా ప్రారంభించారు. సలార్ సినిమాపై ఆతృతను తట్టుకోలేక సలార్ సినిమాను ట్రెండ్ చేస్తున్నారు.
ట్విట్టర్‌లో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ హవా నడుస్తోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాపై అభిమానుల్లో ఉత్సుకత మరింతగా పెరిగిపోయింది. సాల్ నహీ సాలార్ హై అంటూ కొత్త ఏడాది తొలిరోజు ట్రెండింగ్ చేయడం ప్రారంభించేశారు.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ప్రభాస్-ప్రశాంత్ నీల్ సినిమా సలార్ కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. 2023 కొత్త ఏడాది తొలిరోజు అంటే జనవరి 1న ఈ సినిమా ట్విట్టర్‌లో భారీగా ట్రెండ్ అవుతోంది. సాల్ నహీ సలార్ హై అంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ #SaalNahiSalaarHai ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. అంతేకాదు..2023 సంవత్సరాన్ని ప్రభాస్ అభిమానులు సలార్ సంవత్సరంగా ప్రకటించేశారు.
సోషల్ మీడియాలో అభిమానులు సలార్ సినిమాను ట్రెండ్ చేయడం ద్వారా ఆ సినిమాపై తమకు ఉన్న ఆతృతను చాటుకున్నారు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తొలి సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా సినీ పరిశ్రమకు ఓ గేమ్ ఛేంజర్ కానుందనే అంచనాలున్నాయి. దేశంలోని రెండు అతిపెద్ద సినిమా ఫ్రాంచైజీలుగా ఉన్న బాహుబలి, కేజీఎఫ్ కాంబినేషన్ సలార్ సినిమా. బాహుబలి హీరో, కేజీఎఫ్ నిర్మాత, కేజీఎఫ్ దర్శకుడు కేజీఎఫ్ సిబ్బంది కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. హోమ్‌బేల్ ఫిల్మ్స్‌కు కేజీఎఫ్, కేజీఎఫ్-2 తరువాత కాంతారా మరో బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడిదే నిర్మాణ సంస్థ సలార్ సినిమా తీస్తోంది.
2023లో విడుదల కానున్న సలార్ సినిమాపై అందుకే అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే హోమ్‌బేల్ ఫిల్మ్స్ సలార్ సినిమాపై 4 వందల కోట్లు పైగా ఖర్చు చేసింది. సలార్ శకం ప్రారంభమైందని కామెంట్లు విన్పిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook