Panchathantram Teaser video: పంచతంత్రం కథలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో.. అంతే ఆసక్తికరంగా ఒకే సినిమాతో ఎన్నో కథలు వినిపించేందుకు ఆడియెన్స్ ముందుకు వస్తున్న సినిమా పంచతంత్రం. బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను హర్ష పులిపాక డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా పంచతంత్రం మూవీ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ గురించి ఇంకా చర్చించుకునే ముందు టీజర్ వీడియోపై మీరూ ఓ కన్నేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also read : Maa Elections 2021: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం..పెన్షన్ ఫైల్‌పై తొలి సంతకం!


చూశారు కదా పంచతంత్రం మూవీ టీజర్ వీడియో!! టీజర్ చూస్తోంటే.. నయా జమానాలో, ఉరుకుల పరుగుల జీవితంలో, గజిబిజి గందరగోళంలో.. మన చుట్టూ ఉన్న పరిస్థితులనే ఓ కథలా అల్లుకుని, ఆ కథలోనే మరెన్నో కథలు చెప్పే ప్రయత్నం చేశారనిపిస్తోంది. ప్రతీ మనిషి జీవితంలో వారికి తెలియకుండానే చుట్టూ ఉన్న పాత్రల రూపంలో ఎన్నో కథలు తిరుగుతుంటాయి. ఆ పాత్రలు చెప్పే కథలనే ఆధారంగా చేసుకుని పంచతంత్రం కథ అల్లుకున్నాడనిపిస్తోంది. 


ఏదో తెలీని ఆసక్తిని రేకెత్తించి అంతకు మించి మరే ఇతర డీటేల్స్ ఇవ్వకుండా ఆ ఆసక్తి అలాగే కంటిన్యూ అయ్యేలా పంచతంత్రం టీజర్‌ని కట్ చేశారు. ఇటీవల కాలంలో బ్రహ్మానందం (Brahmanandam) సెంట్రిక్‌గా చేసుకుని వస్తున్న మొదటి సినిమా ఇదే. 


అలాగే క్రాక్ మూవీ అనంతరం తెలుగులో ఆకాశవాణి మూవీ (Aakashavaani Trailer) తర్వాత సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న మరో సినిమా కూడా ఇదే. మరిన్ని డీటేల్స్ తెలియాలంటే పంచతంత్రం ట్రైలర్ (Panchathantram trailer) విడుదల కావాల్సిందే.


Also read: Samantha, Naga Chaitanya divorce: సమంత, నాగ చైతన్య అప్పటివరకు భార్యాభర్తలే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook