Parasuram to Skip Devarakonda: సర్కారు వారి పాట లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు పరశురామ్ ఎవరితో సినిమా చేస్తారనే విషయం మీద తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆయన అక్కినేని నాగచైతన్యతో ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ చివరికి అనూహ్యంగా విజయ్ దేవరకొండతో ఆయన సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారంటూ అధికారిక ప్రకటన రావడంతో అభిమానులందరూ గీతగోవిందం కాంబినేషన్ మరోసారి రిపీట్ అయితే విజయ్ దేవరకొండ కి భారీ బ్లాక్ బస్టర్ ఖాయమని అనుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ అది టాలీవుడ్ లో పెద్ద కాంట్రవర్సీకి కారణమైంది.. ఎందుకంటే పరశురాం సినిమా చేస్తానంటూ అల్లు అరవింద్ సహ టాలీవుడ్ లోని దాదాపు పది మంది బడా ప్రొడక్షన్ హౌసులు, నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాడట. అయితే వారెవరికీ సినిమాలు చేయకుండా దిల్ రాజుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. మిగతా నిర్మాతలు అందరూ లైట్ తీసుకున్నా అల్లు అరవింద్ మాత్రం ఈ విషయం మీద సీరియస్ అయ్యారు.  ఈ విషయాన్ని టార్గెట్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమైన తర్వాత నిర్మాతల మండలి ఎన్నికల దృష్ట్యా ఆ ప్రెస్ మీట్ వాయిదా వేసుకున్నారు.


ఇక టాలీవుడ్ లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారడంతో దిల్ రాజు కూడా ఈ సినిమా చేసేందుకు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారసుడు సంక్రాంతి రిలీజ్ విషయంలో ఏకాకిగా మారిన తనకు ఇప్పుడు కొత్త తలనొప్పులు అవసరం లేదని భావించి వెంటనే అల్లు అరవింద్ కి క్షమాపణలు చెబుతూ మెసేజ్ పెట్టారట. ఈ విషయంలో ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ జరిగింది ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పెడుతున్నామని ఆయన చెప్పినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న ఖుషీ సినిమా కూడా ప్రస్తుతానికి షూటింగ్ దశలోనే ఉంది. సమంత అనారోగ్యం దృష్ట్యా ఈ సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది.


ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు దేవరకొండ పరశురామ్ పెట్ల ప్రాజెక్టు పక్కన పెట్టారని అంటున్నారు. పరశురాం తర్వాత ఈ సినిమా చేయవచ్చని భావిస్తూ మరో హీరోను వెతికే పనిలో పడ్డారని అంటున్నారు. అలా వెతుకులాటలో ఆయన తమిళ హీరో కార్తీతో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకున్నారని ఇప్పుడు కార్తీ చేస్తున్న ప్రస్తుత సినిమాలు పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మధ్య తెలుగు దర్శకులు తమిళ హీరోలు కాంబినేషన్లో బాగానే వర్క్ అవుట్ అవుతున్నాయనే నమ్మకంతో ఈ మేరకు ముందుకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని తెలుగు తమిళ భాషలలో ఏకకాలంలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు, చూడాలి మరి ఏమవుతుందో?
Also Read: Anushka Shetty Rare Disease: 'అనుష్క'కి అరుదైన వ్యాధి.. అది వస్తే 15-20 నిముషాలు మనిషే కాదట!


Also Read: Trivikram Behind Pawan Kalyan: పవన్ తప్పుల వెనుక త్రివిక్రమ్.. అసలు విషయం బయటపెట్టిన నిర్మాత!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook