Pathaan Day 1 Collections Worldwide: చాలాకాలం తరువాత షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా థియేటర్లలో సందడి చేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ సినిమా విడుదలైనప్పటికీ, పలు చోట్ల నిరసనలు జరిగాయని తెలుస్తోంది. ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమాకి విశేష ఆదరణ లభించింది. మరి రిపబ్లిక్ డేకి ఒకరోజు ముందు విడుదలైన 'పఠాన్' ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాదాపు నాలుగు సంవత్సరాల నిరీక్షణ తర్వాత, షారుక్ ఖాన్ 'పఠాన్' ద్వారా తిరిగి తన సత్తా చాటాడు. ఈ సినిమా రిలజ్ట్ విషయంలో షారుఖ్ సహా టీం అంతా ముందు నుంచి మంచి పాజిటివ్ గానే ఉన్నా బాయ్ కాట్ వీరుల వలన సినిమాకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందేమో అనుకున్నారు కానీ అదేమీ లేకుండానే ఇబ్బంది లేకుండా సినిమా బయటపడింది. ఇప్పుడు సినీ విమర్శకులు 'పఠాన్‌'పై విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.


అలాగే ఈ సినిమా సోషల్ మీడియాలో సైతం విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఇక సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఆదరించిందనడానికి ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ కూడా నిదర్శనంగా నిలుస్తున్నాయి. అందుతున్న సమాచారం మేరకు గ్రాస్ ప్రకారం షారుక్ ఖాన్ సినిమా సెంచరీ కొట్టింది. ట్రేడ్ వర్గాల వారి లెక్కల ప్రకారం ఈ సినిమా బుధవారం నాడు 52.50 కోట్ల షేర్ వరకు వసూలు చేసిందని అంటున్నారు.


దీంతో 'పఠాన్' సినిమా షారూఖ్ ఖాన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచిందని అంటున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ పరంగా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 6వ భారతీయ చిత్రంగా నిలిచింది. భారతీయ సినిమా చరిత్రలో ఆల్ టైమ్ 5వ అత్యధిక ఓపెనింగ్ డే గ్రాసర్ గా నిలిచింది. ఆ లిస్టు ఇలా ఉంది బాహుబలి2 (2017), 2 పాయింట్ఓ (2018), సాహో (2019), ఆర్ఆర్ఆర్ (2022), కేజీఎఫ్  (2022) ఇక ఇప్పుడు పఠాన్ (2023).


Also Read: Balakrishna Dabidi Dibide: వాడికి దబిడి దిబిడే.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్


Also Read: VSR vs WV Collections: 'వీర సింహ' వెనక్కు తగ్గినా నేను తగ్గనంటున్న వీరయ్య!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook