Pathan New Controversy: మరో వివాదంలో చిక్కుకున్న పఠాన్.. ఆ బట్టలతో సినిమా రిలీజ్ అవ్వనివ్వం!
Pathan New Controversy: షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన పఠాన్ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంటూ ఉండగా ఇప్పుడు ఆ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది, ఆ వివరాల్లోకి వెళితే
Pathan Landed in New Controversy: షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన పఠాన్ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా ఈ చిత్రంలోని 'బేషరమ్ రంగ్' అనే పాటను విడుదల చేశారు ఈ సినిమా మేకర్స్. ఈ సాంగ్ పై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ పాటలో దీపికా పదుకొణె, షారుఖ్ ఖాన్ కలిసి చేసిన డ్యాన్స్ స్టెప్పులు ట్రోల్ అవుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ సినిమా మీద తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
ఈ సాంగ్ లో వాడిన కాస్ట్యూమ్స్ మార్చకపోతే సినిమా విడుదలకు అనుమతించాలా, వద్దా అని ఆలోచిస్తానని కామెంట్ చేశారు. ఈ పాటలో దీపికా పదుకొణె చాలా బోల్డ్‌గా, ఎరోటిక్‌గా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ పాటలో దీపిక బికినీలో, అది కూడా కాస్త కాషాయ రంగున్న బికినీలో కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో కొంత మంది ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో ఈ సినిమా విడుదలకు ఇబ్బందిగా కనిపిస్తోంది.
తాజాగా మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ, పాటలో ఉపయోగించిన దుస్తులు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. భ్రష్టు పట్టిన మనస్తత్వం కారణంగానే ఈ పాట చిత్రీకరించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఏది ఏమైనప్పటికీ, JNU కేసులో దీపికా పదుకొనే జీ తుక్డే-తుక్డే గ్యాంగ్‌కు మద్దతుదారుగా ఉన్నారని, ఈ కారణంగా, నేను విజువల్స్ మార్చవలసిందిగా అభ్యర్థిస్తున్నానని అన్నారు.
కాస్ట్యూమ్స్ మార్చకుంటే మధ్యప్రదేశ్‌లో ఈ సినిమాని అనుమతిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. దీపిక దారుణమైన దుస్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. "షారుఖ్ ఖాన్ చిత్రం 'పఠాన్' పవిత్రమైన కాషాయ, కుంకుమ రంగును 'సిగ్గులేని రంగు'గా చిత్రీకరిస్తోందని ఒకవైపు షారుఖ్ ఖాన్ మాతా వైష్ణో దేవిని దర్శిస్తూనే మరోపక్క హిందువుల నమ్మకాలను వమ్ము చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు.
ఇక బీజేపీ నేత అరుణ్ యాదవ్ కూడా బాయ్‌కాట్ పఠాన్ హ్యాష్‌ట్యాగ్‌కు మద్దతు ఇస్తూ షారుక్‌పై కామెంట్స్ చేసారు. మరికొందరు వినియోగదారులు కూడా చిత్రం పేరు, దీపిక దుస్తులు మరియు పాటలోని సాహిత్యాన్ని లింక్ చేయడం ద్వారా ఆమె పరువు తీశారని ఆరోపించారు. ఈ చిత్రంలో షారుక్ ఖాన్ ముస్లిం పఠాన్ అని, అతను ఆకుపచ్చ చొక్కా ధరించి, కాషాయ దుస్తులు ధరించిన హిందూ అమ్మాయిని వేధిస్తున్నాడని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఇది 'లవ్ జిహాద్', ఘజ్వా-ఎ-హింద్ అని అందుకే ఈ సినిమాను బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
Also Read: Rana Birthday : రానా బర్త్ డేపై మిహిక స్పెషల్ పోస్ట్.. వెంకీమామ కూతురు కామెంట్స్ వైరల్
Also Read: SS Rajamouli's Family: తీవ్ర విషాదంలో మునిగిపోయిన రాజమౌళి ఫ్యామిలీ..ఆమె కన్నుమూయడంతో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook