Super Queen 2 Promo బుల్లితెరపై పవిత్ర, భాను శ్రీ, ప్రదీప్ ఇలా అందరూ సందడి చేస్తుంటారు. ఈ మధ్య అయితే భాను శ్రీ వాయిస్ మీద దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఆ మధ్య ఓ సారి శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో బిగ్ బాస్ ఫేమ్ భాను పాట పాడిన సంగతి తెలిసిందే. దెబ్బకు సోషల్ మీడియా ఉలిక్కి పడింది. భాను శ్రీ పాడిన పాటకు, ఇంద్రజ ఇచ్చిన కాంప్లిమెంట్‌కు తలలు పట్టేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గెలుపు తలుపులే తీసే.. అంటూ దారుణమైన గొంతుతో భాను శ్రీ పాట పాడిన సంగతి తెలిసిందే. ఆ పాటను ఖూనీ చేసిందని అందరూ ట్రోల్స్ చేశారు. ఆ పాటలోని ఫీల్ మొత్తాన్ని చెడగొట్టిందని నెటిజన్లు అంటుంటే.. ఇంద్రజ మాత్రం దారుణమైన జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ పాటలోని డెప్త్ నీ వాయిస్‌లో కనిపించింది అంటూ ఇంద్రజ ఓవర్ యాక్షన్ చేసింది. ఇదంతా ప్రోమోలో కనిపించింది. ఎపిసోడ్‌లో అయితే భాను శ్రీ పాడిన పాటను లేపేశారు. ఇంద్రజ చెప్పిన జడ్జ్మెంట్‌ను కూడా లేపేశారు.


 



అయితే భాను శ్రీ కర్ణకఠోరమైన గొంతుతో పాడిన పాటను మాత్రం జనాలు ట్రోల్ చేస్తూనే వచ్చారు. జనాల వరకు కాకుండా శ్రీదేవీ డ్రామా కంపెనీలోని సెలెబ్రిటీలు, ఆర్టిస్టులే భాను శ్రీ పాట పాడిన తీరుని ట్రోల్ చేస్తూ వచ్చారు. అసలే ఆమె గొంతు కాస్త మగ వాయిస్‌లా వినిపిస్తుంటుంది. ఇక ఆమె పాట పాడే సరికి అందరి చెవుల్లోంచి రక్తాలు వచ్చినట్టు అయింది.


Also Read:  Malli Pelli Teaser : మళ్లీ పెళ్లి టీజర్.. నరేష్-రమ్య రఘుపతి-పవిత్రల కథే సినిమానా?.. హోటల్ సీన్ కేక


తాజాగా మళ్లీ భాను శ్రీ సూపర్ క్వీన్ సీజన్ 2లో వచ్చింది. భాను శ్రీ గొంతుతో పవిత్ర గొంతును ప్రదీప్ పోల్చారు. సీజన్ అయినా మానేస్తాను గానీ.. భాను శ్రీ గొంతుతో తన గొంతుని మాత్రం పోల్చొద్దు అని పవిత్ర వేడుకుంది. ఇంతోనే భాను శ్రీ ఏదో అంటే.. గెలుపు తలుపులే అంటూ భాను పాడిన పాటను ప్లే చేసి పరువుతీశారు. ఇక అది చాలదన్నట్టుగా.. ఇంద్రజ చెప్పిన మాటలను పవిత్ర అనేసింది. నీ వాయిస్‌లో డెప్త్ ఉందంటూ కౌంటర్లు వేసింది. వాయిస్ గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి.. అంటూ ప్రదీప్ దండం పెట్టేశాడు.


Also Read: Asha Negi Photos : బెడ్డుపై నగ్నంగా బుల్లితెర నటి.. ఆశలు రేపేలా ఆశా నేగి పోజులు.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook