Pavitra Lokesh Fired From Two movies: నటి పవిత్ర లోకేష్, సీనియర్ నటుడు నరేష్ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహ సంబంధమే అని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ వీరిద్దరూ కలిసి ఒకే హోటల్ గదిలో కనిపించడంతో అది కూడా నరేష్ భార్య ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేయడంతో టాలీవుడ్ లో ఈ అంశం మీద పెట్ట ఎత్తున చర్చ జరుగుతోంది. నరేష్ కెరీర్ ఎంతవరకు ఇబ్బంది పడుతుందో తెలియదు కానీ తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు  పవిత్ర లోకేష్ కెరియర్ మాత్రం ఈ వ్యవహారంతో బాగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎందుకంటే పవిత్ర లోకేష్ ఇప్పటికే చాలా మంది హీరోలకు తల్లి పాత్రలలో కనిపించింది. అలాగే కొన్ని సినిమాల్లో హీరోయిన్లకు కూడా తల్లి పాత్రలో కనిపించి హోమ్లీ తల్లిగా గుర్తింపు పొందింది. అయితే నరేష్ కు ఆమెకు మధ్య ఏమున్నదో తెలియదు కానీ మీడియాలో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న నేపథ్యంలో ఆమెను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తీసుకున్న రెండు పెద్ద సినిమాల దర్శక నిర్మాతలు ఆమెకు షాకిచ్చారట. అదేమంటే ఆమె మేనేజర్ కి ఫోన్ చేసి ప్రస్తుతానికి ఆమె పాత్రలో వేరే వారిని తీసుకుంటున్నామని ఏమీ అనుకోవద్దు అని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. 


ఆ రెండు క్యారెక్టర్లు కూడా పెద్ద సినిమాలలో పెద్ద బ్యానర్లలోనే ఆమె చేయాల్సి ఉంది, కానీ రిస్క్ తీసుకోవడానికి ఆ పెద్ద బ్యానర్ల నిర్మాతలు సిద్ధంగా లేకపోవడంతో ఆమెను ఆ పాత్ర నుంచి తప్పించారని తెలుస్తోంది. అయితే మరి కన్నడ నాట కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆమెకు అక్కడ కూడా ఇలాంటి రకమైన ఇబ్బందులు ఎదురవుతాయా లేదా అనేది చూడాల్సి ఉంది. నిజానికి పవిత్ర లోకేష్ తాను నరేష్ సహజీవనం చేస్తున్నామని ఒక కన్నడ మీడియా ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో బయటపెట్టారు. తమ సంబంధానికి నటుడు కృష్ణ కుటుంబానికి కూడా మద్దతు ఉందని తాము కృష్ణ కుటుంబంతోనే కలిసి ఫాంహౌస్ లో నివసిస్తున్నామని ఆమె చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారం పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారడంతో ఆమెకు సినిమా అవకాశాలు చేజారిపోతున్నాయి అని అంటున్నారు. 
Also Read: Vijay Sethupathi in Pushpa 2: భలే ప్లానేసిన పుష్ప టీం.. ఈసారి విజయ్ సేతుపతి మిస్సవ్వకుండా!


Also Read: Telugu movies this week: ఈ వారం థియేటర్స్, ఓటీటీలలో రిలీజ్ అయ్యే సినిమాలివే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook