Pavala Shyamala Comments on Karate Kalyani: తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించిన పావలా శ్యామల ఆర్థిక పరిస్థితి బాలేదంటూ గత ఏడాది కరోనా సమయంలో కరాటే కళ్యాణి వెలుగులోకి తీసుకొచ్చారు. తెలుగులో చాలెంజ్ అనే సినిమాతో నటిగా పరిచయమైన శ్యామల బాబాయి అబ్బాయి అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక గోపీచంద్ గోలీమార్ సినిమాలో పావలా శ్యామల నటన ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ అంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఒక వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీస్తున్న పావలా శ్యామల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా కరాటే కళ్యాణి గురించి ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కొన్నాళ్ల క్రితం శ్యామల వ్యవహారాన్ని మీడియా దృష్టికి తీసుకు వచ్చిన తర్వాత కరాటే కళ్యాణి పావలా శ్యామల పద్ధతి ఏ మాత్రం బాలేదని ఆమెకు సహాయం చేస్తుంటే ఇంత కావాలని అంత కావాలని డిమాండ్ చేయడం బాలేదని కామెంట్స్ చేసింది.అంతేకాక ఆమె ఇల్లంతా దుర్వాసన వెదజల్లుతోంది, ఇంట్లో కొంచెం సేపు కూడా ఉండలేకపోయామని చెప్పుకువచ్చారు.


తాజాగా ఈ విషయం మీద మాట్లాడిన పావలా శ్యామల ఎవరో చెప్పారని నాకు సహాయం చేయడానికి వచ్చిన కళ్యాణి నా ఇల్లు శుభ్రంగా లేదంటూ మీడియా ముందు చెప్పడం నాకే అసహ్యం వేసింది అని కామెంట్ చేశారు. అసలు సహాయం వద్దు ఏం వద్దు సహాయం పేరున ఇలాంటి మాటలు వినాలా అని నాకు అనిపించింది కానీ ఏమీ చేయలేని పరిస్థితని ఆమె అన్నారు. నాకు చేతగాని పరిస్థితుల్లో నా కుమార్తెకు కాళ్లు పనిచేయక ఇద్దరం మంచాన పడి ఉంటే ఇల్లు శుభ్రంగా లేదని అనడం ఏమాత్రం నచ్చలేదని శ్యామల అన్నారు.


ఇక ప్రస్తుతానికి కొన్ని ఉచిత ఆశ్రమాలు కూడా ఉన్నాయి కదా మీరు ఎందుకు డబ్బులు కట్టి ఈ ఆశ్రమంలో ఉంటున్నారు అని ప్రశ్నిస్తే ఈ ఆశ్రమంలో  డబ్బులు తీసుకుంటున్నా నన్ను సరిగా చూడటం లేదు, అలాంటిది ఉచిత ఆశ్రమాలు ఇంకా ఎంత దారుణంగా ఉంటాయో మీరు అర్థం చేసుకోవచ్చు, ఇక్కడే పనిమనిషి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు వస్తుంది. అప్పటివరకు మా కుమార్తె ఇబ్బంది పడుతూనే ఉండాల్సి వస్తోంది, ఎవరో ఏదో అనుకుంటారని ఒక ఆర్టిస్టుగా బ్రతికిన నేను విలువ తగ్గించుకోనని అన్నారు. మా మెంబర్షిప్ నేను తీసుకోలేకపోతే చిరంజీవి డబ్బులు కట్టి మెంబర్షిప్ ఇప్పించారు మా కుమార్తె ఆరోగ్యం కోసం రెండు లక్షల సహాయం కూడా చేశారని అన్నారు.


ఇక మంచు విష్ణు ప్రెసిడెంట్ అయ్యాక నా సహాయం కోసం ఒక అమ్మాయిని పెట్టారని, ఆ అమ్మాయి వచ్చి నన్ను ఆపరేషన్ చేయించుకోమని చెబితే డాక్టర్లు ఆపరేషన్ చేయించుకుంటే ఈ శరీరం తట్టుకోలేదని చెప్పడంతో చేయించుకోమని చెప్పానని అన్నారు. ఆ తర్వాత ఆమె నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి వెళ్లిపోయిందని అన్నారు. ఇక నేను కట్టిన లక్ష రూపాయలకు వడ్డీగా 6000 రూపాయలు మాత్రం బ్యాంక్ అకౌంట్ లో మాయా వాళ్లు వేస్తుంటారని నేను బ్రతికి ఉన్నానో లేదో కూడా చూడకుండా వదిలేశారని ఆమె ఎమోషనల్ అయ్యారు. 


Also Read: Hansika Motwani Husband : హన్సికకు కాబోయే భర్త ఇతడే.. బయటపెట్టేసిన బ్యూటీ


Also Read: Satya Dev Full Bottle First Look : పాదరసం లాంటి మనిషి.. ఫుల్ బాటిల్ అంటూ సత్యదేవ్ సందడి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook