Pawan Kalyan Marriages : అసలు నేను పెళ్లే చేసుకోవాలని అనుకోలేదు.. అందుకే అలా వాళ్లతో విడిపోయాను : పవన్ కళ్యాణ్
Pawan Kalyan Marriages పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, విడాకులపై రాజకీయ నాయకులు చేసే కామెంట్లు అందరికీ తెలిసిందే. అయితే బాలయ్య షోలో పవన్ కళ్యాణ్ అసలు విషయాన్ని చెప్పాడు. ఎందుకు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందో తెలిపాడు.
Pawan Kalyan Marriages పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల మీద రాజకీయ నేతలు చేసే కామెంట్లు అందరికీ తెలిసిందే. నందినితో పెళ్లి వివాహాం, రేణూ దేశాయ్‌తో డేటింగ్, ప్రేమ, పెళ్లి, విడాకుల సంగతి అందరికీ తెలిసిందే. ఇక అన్నా లెజినోవాతో ప్రేమ, పెళ్లి సంగతి గురించి తెలిసిందే. అయితే చట్ట ప్రకారం విడాకులు తీసుకుని ఆ తరువాత మళ్లీ పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. మూడు పెళ్లిళ్లపై బాలయ్యతో పంచుకున్నాడు పవన్ కళ్యాణ్.
అసలు నేను పెళ్లే చేసుకోవాలని అనుకోలేదు.. అలానే బ్రహ్మచారిలా ఉండాలని అనుకున్నాను.. కానీ నాకు మా ఇంట్లో వాళ్లు పెళ్లి చేశారు.. ఆ తరువాత అందరి ఇళ్లలోలానే భార్యాభర్తల మధ్య గొడవలో, మనస్పర్ధలో, బేధాభిప్రాయాలో, భిన్నాలోచనలో వచ్చాయి.. కుదరలేదు.. విడిపోయాం.. చట్టప్రకారం విడాకులు తీసుకుని.. మళ్లీ పెళ్లి చేసుకున్నాను.. నేను ఒకేసారి ముగ్గురితో ఉండలేదు.. మూడు సార్లు పెళ్లిళ్లు చేసుకున్నానేమో గానీ.. ముగ్గురితో ఒకేసారి ఉండలేదు.. అంటూ ఇలా క్లారిటీగా చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
అందరి ఇంట్లో ఉండే సమస్యలే తప్పా.. కొత్తగా ఏమీ లేదు.. కానీ నన్ను అందరూ పెళ్లిళ్ల మీద విమర్శిస్తుంటారు.. నన్ను విమర్శించే వాళ్లను నేను కూడా అనొచ్చు కానీ నా సంస్కారం అడ్డు పడుతుంది.. ఏమైనా అంటే వాళ్ల ఇంట్లోని స్త్రీలు బాధపడతారని నేను ఆగుతుంటాను అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.
ఇక పవన్ కళ్యాణ్ చెప్పిన వివరణ విన్న బాలయ్య అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మీద ఎవడైనా కామెంట్లు చేస్తే వాడు ఊర కుక్కతో సమానం అని స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చాడు బాలయ్య.
Also Read: Samantha Russo brothers : నువ్ నాకు దొరకడం నా అదృష్టం.. సమంత పోస్ట్ వైరల్
Also Read: Aha Twitter DP : దెబ్బకు డీపి కూడా మార్చేశారు.. పవన్ కళ్యాణ్ కోసం ఆహా అనేలా ప్రమోషన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook