Varun Tej And Lavanya Tripathy Wedding: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం నవంబర్ 1న ఇటలీలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా, అల్లు కుటుంబాలు ఇటలీకి చేరుకున్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుటుంబసమేతంగా ఇటలీకి బయల్దేరారు. హైదరాబాద్‌ విమానాశ్రయంలో పవన్ కనిపించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో పవన్ సింపుల్ లుక్‌లో కనిపించారు. కొద్ది రోజుల కిందటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి ఇటలీ వెళ్లారు. అక్కడే ఉండి వరుణ్ పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. నిన్ననే వరుణ్, లావణ్య ఇటలీకి వెళ్లారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహానికి మెగా, అల్లు ఫ్యామిలీలతోపాటు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు షురూ అయ్యాయి. అలాగే ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా అక్టోబర్‌ 30న కాక్‌టేల్‌ పార్టీతో మొదలు పెట్టి 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు. ఇటలీ నుంచి తిరిగి వచ్చాక నవంబర్‌ 5న సినీ ఇండస్ట్రీలోని ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ వివాహానికి సంబంధించిన పెళ్లి కార్డు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం ఈ ఏడాడి జూన్ లో జరిగిన సంగతి తెలిసిందే.  



Also Read: Wedding Bells : మరో తెలుగు హీరో పెళ్లి.. ఆంధ్ర వారితో వియ్యమందుకుంటున్న దిల్ రాజు ఫ్యామిలీ..


Also Read: Lalu Prasad Yadav Biopic: వెండి తెరపైకి లాలూ బయోపిక్.. ఆయన పాత్రలో ఓ మై గాడ్ 2 నటుడు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook