Lalu Prasad Yadav Biopic: వెండి తెరపైకి లాలూ బయోపిక్.. ఆయన పాత్రలో ఓ మై గాడ్ 2 నటుడు?

Lalu Prasad Yadav Biopic: ఈ మధ్య కాలంలో బయోపిక్స్ ఎక్కువవుతున్నాయి. త్వరలోనే బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ బయోపిక్ సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఆయన పాత్రలో ఎవరు నటించనున్నారంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2023, 04:35 PM IST
Lalu Prasad Yadav Biopic: వెండి తెరపైకి లాలూ బయోపిక్.. ఆయన పాత్రలో ఓ మై గాడ్ 2 నటుడు?

Lalu Prasad Yadav Biopic: ప్రస్తుతం దేశవ్యాప్తంగా బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు, సినీ ప్రముఖులు, పొలిటీషియన్స్, మేధావుల జీవిత చరిత్రలు వెండితెరపై ఆవిష్కరించబడ్డాయి. త్వరలోనే కేంద్రమంత్రి నితిన్ గఢ్కరీ బయోపిక్ కూడా ఆడియెన్స్ ముందుకు రానుంది. తాజాగా బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ బయోపిక్ ను కూడా తీసేందుకు మేకర్స్ ఆసక్తి చూపుతున్నారట. లాలూ జీవిత కథను తెరకెక్కించేందుకు బాలీవుడు బడా దర్శకుడు, నిర్మాత ప్రకాష్ ఝా రెడీ అవుతున్నాడట. దీని కోసం ఆయన లాలూ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి అనుమతులు కూడా తీసుకున్నట్లు టాక్. ఒక్కసారి స్క్రిప్ట్ ఓకే అయితే వెంటనే షూటింగ్ ప్రారంభించేందుకు ప్రకాష్‌ ఝా రెడీగా ఉన్నారట. ఈ చిత్రానికి నిర్మాతగా లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ వ్యవహారించనున్నారని సమాచారం. 

ఇక లాలూ బయోపిక్‌లో ప్రముఖ నటుడు ఓ మై గాడ్‌ 2 ఫేమ్ పంకజ్‌ త్రిపాఠీ లీడ్‌ రోల్‌లో నటించనున్నట్లు సమాచారం. అలాగే రాజ్‌ కుమార్‌ రావ్‌, విక్కీ కౌశల్‌, మనోజ్‌ బాజ్‌పేయిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. లాలూ తన వ్యక్తిగత, రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోన్న సంగతి తెలిసిందే. ఆయన బయోపిక్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కృతం అవుతుందంటే దేశమెుత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని.. ఈ లిస్ట్ లో పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా ఉన్నారని.. తర్వలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని దర్శకుడు చెప్పారు. 29 ఏళ్ల వయసులోనే లాలూ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా, బీహార్ ముఖ్యమంత్రిగా, కేంద్ర రైల్వే మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత పలు కుంభకోణాల్లో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. 

Also Read: Skanda Movie: ఇట్స్ అఫిషియల్.. స్కంద ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News