Pawan Kalyan- Sai Dharam Tej: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మేనల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ (Sai Dharam Tej)తో కలిసి నటించనున్నారు. త‌మిళంలో రూపొందిన 'వినోదయ సీత‌మ్' చిత్రానికి రీమేక్  గా తెరకెక్కే ఈ సినిమాలో వీరిద్ధరూ నటించనున్నారు. సముద్ర‌ఖ‌ని, తంబిరామ‌య్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన 'వినోదయ సీత‌మ్' చిత్రం అక్కడ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. యాక్సిడెంట్‌లో చనిపోయిన వ్య‌క్తి.. భగవంతుడి అంగీకారంతో తిరిగి 90 రోజుల పాటు జీవించే అవకాశాన్ని పొందిన తర్వాత ఏం జ‌రిగింద‌నే పాయింట్‌తో డైరెక్టర్ స‌ముద్ర‌ఖ‌ని ఈ సినిమాను తెర‌కెక్కించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రీమేక్‌కు కూడా ఆయనే దర్శకత్వం వహించనున్నారు.  అయితే పవన్ కల్యాణ్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ నేటివిటీకీ తగనట్లు మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. జూన్ నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జీస్టూడియోస్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి.


ఇటీవల 'భీమ్లానాయ‌క్' (Bheemla Nayak) సినిమా విజయంతో మంచి జోష్ లో ఉన్న పవన్ వరుసగా సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీశ్ శంకర్ కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు చేస్తున్న పవర్ స్టార్...తమిళ సూపర్ హిట్ సినిమా 'తేరి' రీమేక్‌లో నటించేందుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. 


Also Read: Anil Ravipudi: మహేశ్ కోసం క‌థ రెడీ చేస్తున్నా.. ఆయన ఓకే అంటే చాలు: అనిల్ రావిపూడి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook