Anil Ravipudi: మహేశ్ కోసం క‌థ రెడీ చేస్తున్నా.. ఆయన ఓకే అంటే చాలు: అనిల్ రావిపూడి

Mahesh Babu- Anil Ravipudi: సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు (Mahesh Babu), స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబో మరోసారి రిపీట్ కానుందా? అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 09:12 PM IST
Anil Ravipudi: మహేశ్ కోసం క‌థ రెడీ చేస్తున్నా.. ఆయన ఓకే అంటే చాలు: అనిల్ రావిపూడి

Mahesh Babu- Anil Ravipudi: సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో వచ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు (Sarileru Neekevvaru) ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మరోసారి ఈ స్టార్ కాంబో రిపీట్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ''మహేశ్ సార్ తో మరోసారి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా.. ఆయన కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నా.. ఆయన ఎస్ అంటే ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలు పూర్తవ్వగానే ఈ మూవీ ప్రారంభిస్తా అంటూ అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. 

ప్రస్తుతం మహేశ్ (Mahesh babu) నటించిన సర్కారువారి పాట చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం మే 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. మహేశ్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. 

ప్రస్తుతం అనిల్ రావిపూడి 'ఎఫ్3' (F3 Movie) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 'ఎఫ్2'కు సీక్వెల్‌గా  తెరకెక్కుతోంది. వెంకటేశ్, వరుణ్ తేజ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనిల్ బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్నారు. త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. 

Also Read: Acharya OTT Release Date: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'ఆచార్య' ఓటీటీ రిలీజ్ అప్పుడే? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News