Pawan Kalyan and Sai Dharam Tej Movie Title is Bro: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు. తమిళంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కథలో మార్పులు చేశాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2023 జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా సెట్స్‌ నుంచి లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఈ సినిమాకు సంబందించిన తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ సినిమా టైటిల్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. ఈ చిత్రంకు ‘బ్రో:ది అవతార్‌’ (BRO) అనే పేరును ఖరారు చేశారు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కూడా రిలీజైంది. పోస్టర్‌లో పవన్‌ కళ్యాణ్ స్టయిలిష్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. అంతేకాకుండా చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. ఈ పోస్టర్‌తో పవన్‌ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌లో నేపథ్య సంగీతం చాలా బాగుంది. 


బ్రో సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ దేవుడిగా కనిపించనున్నాడు. తమిళంలో దేవుడిగా నటించిన సముద్రఖని పాత్రలో పవన్‌ కళ్యాణ్‌ కనిపించనున్నాడు. మరోవైయిపు తంబి రామయ్య పోషించిన పాత్రను సాయిధరమ్‌ తేజ్‌ చేస్తున్నాడు. ఇప్పటికే పవన్‌ షూటింగ్‌ పూర్తయియిందని సమాచారం. త్వరలోనే సాయి షూటింగ్ కూడా ఎండ్ అవుతుందట. సముద్రఖని స్క్రీన్‌ప్లే, టేకింగ్‌.. త్రివిక్రమ్ మార్పులు ఎలా ఉండబోతున్నాయని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 



ఒక యాక్సిడెంట్‌లో చనిపోయిన ఓ వ్యక్తికి తాను మాత్రమే చేయాల్సిన పనులు కొన్ని అలానే మిగిలి ఉంటాయి. ఆ పనుల కోసం మూడు నెలలు సమయం కావాలని తనని తీసుకెళ్లడానికి వచ్చిన దేవుడిని కోరతాడు. ఆ వ్వక్తి మాటలకు పడిపోయిన దేవుడు.. మూడు నెలలు అతడితోనే ప్రయాణిస్తాడు. ఆ వ్యక్తి తాను అనుకున్న పనులను పూర్తి చేశాడా?, పనులు అయ్యాక దేవుడి అతడిని వదిలేశాడా? విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. 


Also Read: Virat Kohli Bowling: పాడ్స్ కట్టుకుని మరీ బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ.. గ్లెన్ మాక్స్‌వెల్ కామెంటరీ అదుర్స్! వైరల్ వీడియో  
Also Read: Realme Narzo N53 Launch: బడ్జెట్ ధరలో కొత్త ఫోన్‌ను విడుదల చేసిన రియల్‌మీ.. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ! 30 నిమిషాల్లో ఛార్జింగ్‌  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.