Bheemla Nayak Release: భీమ్లా నాయక్.. భీమ్లా నాయక్.. ప్రస్తుతం ఏ పవన్ కల్యాణ్ ఫ్యాన్ నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న వేళ పవన్ ఫ్యాన్స్ పవన్ నామస్మరణతో ఊగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు తమ అభిమాన నటుడిని వెండి తెరపై చూద్దామా అన్న ఆత్రుతలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలకు అనుమతినివ్వడంతో ఇక్కడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదే సమయంలో ఏపీలో మాత్రం పాత రూల్సే కొనసాగనున్నాయి. అంటే.. భీమ్లా నాయక్‌కి ఏపీలో ఎటువంటి స్పెషల్ షోలు లేనట్లే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భీమ్లా నాయక్ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అభ్యర్థన మేరకు తెలంగాణ ప్రభుత్వం థియేటర్లలో ఐదో షో ప్రదర్శనకు అనుమతినిచ్చింది. సినిమా విడుదల కానున్న ఈ నెల 25 నుంచి మార్చి 11 వరకు ఈ షోలు ప్రదర్శించుకోవచ్చు. మరోవైపు ఏపీలో పాత నిబంధనలను ఇంకా మార్చకపోవడంతో స్పెషల్ షో లేదా బెనిఫిట్ షోలకు ఆస్కారం లేకుండా పోయింది. థియేటర్లలో బెనిఫిట్ షోలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదర్శించవద్దని ఇప్పటికే ప్రభుత్వ పెద్దల నుంచి వారికి సిగ్నల్స్ వెళ్లినట్లుగా చెబుతున్నారు. 


ప్రస్తుతం ఉన్న ధరలనే కొనసాగిస్తూ భీమ్లా నాయక్ చిత్ర ప్రదర్శన జరగాలని.. బెనిఫిట్ షోలు లేదా అదనపు షోలు వేయరాదని రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ యాజమాన్యాలను హెచ్చరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, రెవెన్యూ అధికారులతో 'భీమ్లా నాయక్' థియేటర్ల వద్ద నిఘా పెట్టబోతున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఏపీ సర్కార్ గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. నిజానికి ఇటీవల చిరంజీవి నేత్రుత్వంలోని టాలీవుడ్ ప్రముఖులు సీఎం జగన్‌ని కలిసిన సందర్భంలో టికెట్ల ధరల పెంపుతో పాటు పెద్ద సినిమాల అదనపు షోల అనుమతికి సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇంకా జీవో విడుదల కాకపోవడంతో ఏపీలో ఇక భీమ్లా నాయక్ బెనిఫిట్ షోలు లేనట్లే..!


Also Read: Bheemla Nayak Release Trailer: భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్.. గూస్ బంప్స్ అంతే.. 


Also read : Bheemla Nayak Trailer: సోషల్ మీడియాలో భీమ్లా నాయక్ మాస్ జాతర.. ట్రైలర్ కు వన్ మిలియన్ లైక్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook