Ustaad Bhagat Singh Poster : అది డూప్ అంటూ రచ్చ.. పవన్ కళ్యాణ్ పోస్టర్ మీద కొత్త చర్చ
Pawan Kalyan Harish Shankar Movie పవన్ కళ్యాణ్ సినిమా కోసం హరీష్ శంకర్ గత మూడు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తో సినిమా ముందుకు వెళ్లదు.. ఇంకో హీరోతో సినిమా సెట్ కాదన్నట్టుగా మారింది. ఎట్టకేలకే పవన్ కళ్యాణ్ సెట్లోకి అడుగు పెట్టాడంటూ హరీష్ శంకర్ వేసిన ట్వీట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
Ustaad Bhagat Singh Poster పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టేసింది గబ్బర్ సింగ్. మళ్లీ ఆ రేంజ్ మూవీ కోసం ఈ ఇద్దరూ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోలో మైత్రీ ఓ సినిమాను ఎప్పుడో ఫిక్స్ చేసింది. కానీ ఈ చిత్రం మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ కాస్త టైం ఇచ్చేశాడు. ఆ గ్యాప్‌లో ఎన్నెన్నో జరిగిపోయాయి.
Also Read: Ravanasura Movie Review : రావణాసుర రివ్యూ.. లాజిక్స్ వెతికితే కష్టమేరా
హరీష్ శంకర్ సొంతంగా రాసుకున్న కథను పక్కన పెట్టాల్సి వచ్చింది. భవదీయుడు భగత్ సింగ్ అంటూ ఫిక్స్ చేసుకున్న టైటిల్‌ను మార్చుకున్నాడు. విజయ్ నటించిన తేరీ (తెలుగులో పోలీసోడు) అనే సినిమాను హరీష్ శంకర్ రీమేక్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీ షూటింగ్‌ను ఇటీవలె ప్రారంభించారు. అయితే ఢిల్లీ టూర్ అంటూ పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సమయంలోనే హరీష్ శంకర్ మూవీకి కూడా డేట్స్ కేటాయించాడు.
సెట్‌లో ఫస్ట్ రోజు అంటూ హరీష్ శంకర్ నానా హంగామా చేశాడు. ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి వెయిటింగ్ అంటూ ఓ పోస్టర్‌ను కూడా వదిలాడు. అందులో పవన్ కళ్యాణ్‌ను వెనకాల నుంచి చూపించారు. పోలీస్ డ్రెస్‌లో పవన్ కళ్యాణ్ అలా చేతిలో చాయ్ గ్లాసును పట్టుకుని కూర్చున్నాడు. ఈ ఫోటో మీద ఇప్పుడు నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ ఫోటోలో ఉన్నది పవన్ కళ్యాణ్ కాదని, డూప్‌తో షూట్ చేశారని, అందుకే మొహం చూపించలేదని కొందరు.. ఆ ఫోటోలో ఉన్నది హరీష్ శంకర్ అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇవన్నీ తప్పని సందీప్ రాజ్ ట్వీట్‌తో అర్థం అవుతోంది. పవన్ కళ్యాణ్‌ని ఫస్ట్ టైం చూశానని, ఈ రోజు సెట్‌లో చూసే అవకాశం కల్పించిన హరీష్ శంకర్‌కు థ్యాంక్స్ అని సందీప్ రాజ్ ఎమోషనల్ అయ్యాడు. అంటే ఆ పోస్టర్ పవన్ కళ్యాణ్‌దే అని రుజువైనట్టే.
Also Read: Ravanasura Twitter Review: రావణాసుర ట్విట్టర్ రివ్యూ.. మళ్లీ ఇలాంటివి చేయకు అన్న!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook