Okkadu Re Release Trailer ప్రస్తుతం పాత సినిమాల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి సినిమాను రీ రిలీజ్‌ చేసి కొత్త ట్రెండ్‌ క్రియేట్ చేశారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఆ తరువాత పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్‌గా తమ్ముడు, జల్సా సినిమాలు రిలీజ్ చేశారు. జల్సా సినిమా రికార్డ్ కలెక్షన్లను కలెక్ట్ చేసింది. దీంతో మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ కంటే పవన్ కళ్యాణ్‌ అభిమానులది పై చేయి సాధించినట్టుగా మారింది. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరి అభిమానుల మధ్య వార్ మొదలయ్యేలా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కొత్త ఏడాది సందర్బంగా పవన్ కళ్యాణ్‌ నటించిన సినిమాల్లోని ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా అయిన ఖుషిని డిసెంబర్ 31న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఖుషి రీ రిలీజ్ ట్రైలర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే నాటి రోజుల్లోకి వెళ్లినట్టుగా అనిపిస్తోంది. మణిశర్మ మ్యూజిక్ చేసిన మ్యాజిక్‌ను మరోసారి అలా ఆస్వాధిస్తూ ఉండిపోతారు. పవన్ కళ్యాణ్‌ స్మైల్, లుక్స్, యాక్టింగ్‌ను ఈ ట్రైలర్‌లో అద్భుతంగా కట్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా? అనే ఆసక్తి కలిగేలా ట్రైలర్‌ ఉంది.


 



ఇక మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ను అయితే ఒక్కడు రీ రిలీజ్ ట్రైలర్‌ ఇట్టే ఆకట్టుకుంటోంది. కర్నూలు కొండారెడ్డి బుర్జు సెంటర్‌ సీన్‌తో ట్రైలర్‌ను ఓపెన్ చేశారు. మహేష్ బాబు, భూమికల లవ్ స్టోరీ, దానికి మణిశర్మ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఇచ్చిన పాటలను మళ్లీ గుర్తుకు తెచ్చేసింది ఈ ట్రైలర్. ఈ రెండు ట్రైలర్‌లలో ఏది బెటర్ అంటే చెప్పడం కష్టమే. రెండూ రెండే. వారి వారి అభిమానులను మెప్పించేలా ట్రైలర్‌లను మేకర్లు కట్ చేశారు.


అయితే ఈ రెండు ట్రైలర్‌లలో రెండు కామన్ విషయాలున్నాయి. ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్ భూమికనే. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మనే. మరి ఈ చిత్రాలు రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో? ఎన్ని కోట్లు వసూలు చేస్తాయో చూడాలి.


Also Read : Waltair Veerayya Review : వాల్తేరు వీరయ్యపై చిరంజీవి రివ్యూ.. సినిమా చూసి ఆ ఒక్క మాట చెప్పేశాడట!


Also Read : Bigg Boss Ashu Reddy : అనాథ పిల్లల్ని చదివిస్తున్న అషూ రెడ్డి.. అందరినీ గెలిచేసిన బిగ్ బాస్ బ్యూటీ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook